Rare Chinese Porcelain: చూస్తే చిన్నదే.. ధర తెలిస్తే మాత్రం షాక్..! చైనా మింగ్‌ వంశీకుల వస్తువు..

Rare Chinese Porcelain: చూస్తే చిన్నదే.. ధర తెలిస్తే మాత్రం షాక్..! చైనా మింగ్‌ వంశీకుల వస్తువు..

Anil kumar poka

|

Updated on: Aug 29, 2023 | 8:34 AM

చూశారుగా.. ఇక్కడ కనిపిస్తున్న పురాతన పింగాణీ పాత్ర. చైనాను పాలించిన మింగ్‌ వంశీకుల నాటి పురాతన వస్తువ. ఇది అటు ఇటు తిరిగి ఇంగ్లాండ్‌కు చేరింది. దీన్ని ఇంగ్లండ్‌లోని డోర్‌చెస్టర్‌కు చెందిన డ్యూక్స్‌ ఆక్షనీర్స్‌ అనే సంస్థ వేలం వేసింది. నిర్వాహకులు ఈ పాత్రకు మహా అయితే 100 పౌండ్ల వరకు ధర పలకవచ్చని ముందుగా అంచనా వేశారు. అందువల్ల వేలంపాటను 30 పౌండ్ల నుంచి మొదలుపెట్టారు.

చూశారుగా.. ఇక్కడ కనిపిస్తున్న పురాతన పింగాణీ పాత్ర. చైనాను పాలించిన మింగ్‌ వంశీకుల నాటి పురాతన వస్తువ. ఇది అటు ఇటు తిరిగి ఇంగ్లాండ్‌కు చేరింది. దీన్ని ఇంగ్లండ్‌లోని డోర్‌చెస్టర్‌కు చెందిన డ్యూక్స్‌ ఆక్షనీర్స్‌ అనే సంస్థ వేలం వేసింది. నిర్వాహకులు ఈ పాత్రకు మహా అయితే 100 పౌండ్ల వరకు ధర పలకవచ్చని ముందుగా అంచనా వేశారు. అందువల్ల వేలంపాటను 30 పౌండ్ల నుంచి మొదలుపెట్టారు. వేలంపాటలో వివిధ దేశాల బిడ్డర్లతో పాటు ప్రముఖులు సైతం పాల్గొన్నారు. నిపుణులైన బిడ్డర్లు కొందరు ఇది చైనాను పాలించిన మింగ్‌ వంశీకుల నాటి వస్తువని గుర్తించడంతో భారీ స్థాయిలో వేలంపాటను పెంచుకుంటూ పోయారు. చివరకు ఇంగ్లండ్‌కు చెందిన ఒక పురావస్తు సేకర్త దీనిని 1.04 లక్షల పౌండ్లకు అంటే భారత కరెన్సీలో కోటి 9లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నాడు. మింగ్‌ వంశీకులు చైనాను 1368–1644 కాలంలో చైనాను పాలించారు. వారి హయాంలో తయారైన పింగాణీ వస్తువులు అంత్యంత నాణ్యమైనవి. కళాత్మకమైనవి అని ప్రతీతి. అందుకే ఇది అత్యంత పింగాణీ అయినా ఇంతలా ధర పలికింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..