AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rainbow Waterfall: అరుదైన జాలువారే ఇంద్రధనుస్సు జలపాతం.. ఎక్కడ ఉందో తెలుసా ??

Rainbow Waterfall: అరుదైన జాలువారే ఇంద్రధనుస్సు జలపాతం.. ఎక్కడ ఉందో తెలుసా ??

Phani CH
|

Updated on: Aug 29, 2023 | 7:59 PM

Share

అమెరికాలోని యోస్మైట్ నేషనల్ పార్క్‌లోని ఓ అందమైన జలపాతానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. బలమైన గాలుల మధ్య జారువారే జలపాతాలలో రంగుల హరివిల్లు ఏర్పడటంతో మరింత కనువిందు చేస్తున్నాయి. సూర్యోదయం సమయంలో ఈ అద్భుతం ఆవిష్కృతమయ్యింది. సూర్యకాంతిలోని మృదువైన కిరణాలు నీటి బిందువులను తాకినప్పుడు, వాటి వంపు 1,450 అడుగుల ఎత్తయిన జలపాతంలో ఒక మెరిసే ఇంద్రధనస్సు వెల్లువిరిసింది.

అమెరికాలోని యోస్మైట్ నేషనల్ పార్క్‌లోని ఓ అందమైన జలపాతానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. బలమైన గాలుల మధ్య జారువారే జలపాతాలలో రంగుల హరివిల్లు ఏర్పడటంతో మరింత కనువిందు చేస్తున్నాయి. సూర్యోదయం సమయంలో ఈ అద్భుతం ఆవిష్కృతమయ్యింది. సూర్యకాంతిలోని మృదువైన కిరణాలు నీటి బిందువులను తాకినప్పుడు, వాటి వంపు 1,450 అడుగుల ఎత్తయిన జలపాతంలో ఒక మెరిసే ఇంద్రధనస్సు వెల్లువిరిసింది. కాలిఫోర్నియాలోని ఓ పర్వత ప్రాంతంలో దృశ్యం కనిపించింది. యోస్మైట్ కాలిఫోర్నియాలోని నాలుగు వేర్వేరు కౌంటీలలో సుమారు 7,61,747 ఎకరాల మేరకు విస్తరించింది. విస్తీర్ణం పరంగా యుఎస్ లో 16వ అతిపెద్ద జాతీయ ఉద్యానవనం. ఈ ఫుటేజీని వాస్తవానికి అవుట్‌డోర్ ఫోటోగ్రఫీ సాల్ట్ లేక్ సిటీకి చెందిన గ్రెగ్ హార్లో చిత్రీకరించినట్లు సమాచారం. సుమారు ఉదయం 9 గంటలకు బలమైన గాలులు వీస్తున్నప్పుడు ఈ దృశ్యం ఏర్పడింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక చేతిలో స్టీరింగ్‌, మరో చేతిలో గొడుగు.. జోరువానలో డొక్కు బస్సుతో డ్రైవర్‌ అతి

అది ప్యాలెస్ కాదు.. మరేంటో తెలిస్తే షాకే !!

మసాజ్‌ మిషన్‌లో ఎరక్కపోయి ఎక్కాడు.. ఇరుక్కుపోయాడు !!

కూతురికోసం అమ్మలా మారిన తండ్రి !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్‌ వీడియో

దాహంతో అల్లాడిన శునకం.. ఆ మహిళ ఏం చేసిందో తెలిస్తే !!