పళ్లతో.. బరువులు ఎత్తుతూ గిన్నిస్‌ రికార్డ్‌ !!

కూటి కోసం కోటి విద్యలు అంటారు పెద్దలు. కుటుంబ పోషణకోసం ఆ ఇంటి పెద్ద చేసే పోరాటం వర్ణణాతీయం. అలాంటి సాహసమే చేస్తున్నాడు ఉత్తర్‎ప్రదేశ్‎కు చెందిన 38 ఏళ్ల వికాస్ స్వామి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ కర్నావాల్ గ్రామంలో ఉంటున్న వికాస్ స్వామి పళ్లతో భారీ బరువులు మోస్తూ వరల్డ్ రికార్డులు నెలకొల్పుతున్నారు. 2010లో జరిగిన యాక్సిడెంట్‎లో మంచానికే పరిమితమైన వికాస్, తన స్నేహితుడి సలహాతో యోగా సాధన చేసి మళ్లీ సాదారణ స్థితికి వచ్చాడు.

పళ్లతో.. బరువులు ఎత్తుతూ గిన్నిస్‌ రికార్డ్‌ !!

|

Updated on: Aug 29, 2023 | 8:01 PM

కూటి కోసం కోటి విద్యలు అంటారు పెద్దలు. కుటుంబ పోషణకోసం ఆ ఇంటి పెద్ద చేసే పోరాటం వర్ణణాతీయం. అలాంటి సాహసమే చేస్తున్నాడు ఉత్తర్‎ప్రదేశ్‎కు చెందిన 38 ఏళ్ల వికాస్ స్వామి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ కర్నావాల్ గ్రామంలో ఉంటున్న వికాస్ స్వామి పళ్లతో భారీ బరువులు మోస్తూ వరల్డ్ రికార్డులు నెలకొల్పుతున్నారు. 2010లో జరిగిన యాక్సిడెంట్‎లో మంచానికే పరిమితమైన వికాస్, తన స్నేహితుడి సలహాతో యోగా సాధన చేసి మళ్లీ సాదారణ స్థితికి వచ్చాడు. ఈ క్రమంలోనే అతనికి ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచన వచ్చింది. దీంతో పళ్లతో బరువులు ఎత్తడం స్టార్ట్ చేశాడు. కొద్దికాలంలోనే ఈ విద్యలో ప్రావీణ్యం సాధించాడు. 2021లో మొదటిసారిగా పళ్లతో 80 కేజీల బరువు ఎత్తి వికాస్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు సంపాదించాడు. ఓ ప్రముఖ టీవీ షోలో అమేజింగ్ పెర్ఫార్మెన్స్‎తో గిన్నిస్‌ రికార్డునూ సొంతం చేసుకున్నాడు. పళ్లతో బరువులు లేపడమంటే నిలుచుని కాదు, ఇందులో వికాస్‌ స్టయిలే వేరు. తలకిందులుగా చేతులపై నిలబడి ఈ సాహసం చేస్తాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వర్క్‌ప్లేస్‌లో ఇలా కూడా నిద్రపోవచ్చా !! అందుబాటులోకి స్లీపింగ్‌ పాడ్స్‌

Rainbow Waterfall: అరుదైన జాలువారే ఇంద్రధనుస్సు జలపాతం.. ఎక్కడ ఉందో తెలుసా ??

Follow us