Viral Photo: మీ కళ్ల పవర్ కిర్రాకేనా.! ఈ ఫోటోలో ‘F’ అక్షరం ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం..
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. సోషల్ మీడియాలో వీటికంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఫోటో పజిల్స్‌పై కొందరు సెపరేట్ పేజీలను సైతం రన్ చేస్తుంటారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన బ్రెయిన్ పవర్‌ను ఇంప్రూవ్ చేయడమే కాదు.. కళ్లకు కూడా గట్టిగానే పని చెప్తాయి.
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. సోషల్ మీడియాలో వీటికంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఫోటో పజిల్స్‌పై కొందరు సెపరేట్ పేజీలను సైతం రన్ చేస్తుంటారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన బ్రెయిన్ పవర్‌ను ఇంప్రూవ్ చేయడమే కాదు.. కళ్లకు కూడా గట్టిగానే పని చెప్తాయి. ఇంటర్నెట్ ప్రపంచంలో ఫన్నీ వీడియోలు, వింతలూ, విశేషాలతో చిత్రవిచిత్రమైన పజిల్స్ కూడా ఉన్నాయి. ‘ఈ ఫోటోలో పులి ఎక్కడుందో కనిపెట్టండి’ అంటూ కొన్ని పజిల్స్ ఉంటే.. ‘ఇందులో ఏ అక్షరం దాగుందో చెప్పగలరా’ అంటూ మరికొన్ని.. ‘ఈ నెంబర్ ఎంతో చెప్పండి’ అని ఇంకొన్ని ఫోటో పజిల్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇక ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలైతే వేరే రకం.. పైకి ఇవి మాములు ఫోటోలు మాదిరిగానే ఉంటాయి. కానీ లోపల మనకు కనిపించిన రహస్యాలు దాగుంటాయి. వాటిని కనిపెట్టేందుకు నెటిజన్లు తెగ కష్టపడుతుంటారు. ఆన్సర్ కనిపెట్టాలంటే.. ముప్పుతిప్పలే కాదు మూడు చెరువుల నీళ్లు కూడా తాగాల్సిందే. మరి మీరూ కూడా ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు సాల్వ్ చేయాలనుకుంటే.. మీకూ ఫోటో పజిల్స్ ఇష్టమైతే..? అయితే ఈ పజిల్‌ను ఓ పట్టు పట్టేయండి.
Find The F Letter in this photo #viral #Trending #viralnews @WhatsTrending @trending @AniTrendz @the_viralvideos @TheViralFever @itsgoneviraI pic.twitter.com/xlBU8kueOG
— telugufunworld (@telugufunworld) August 28, 2023
పైకి కనిపిస్తోన్న ఫోటోను చూశారా.? అందులో మీకేం కనిపిస్తోందంటే.. ఠక్కున ‘T’ అక్షరం అని చెప్పేస్తారు. అన్ని వరుసల్లోనూ ‘T’ అక్షరమే ఉంది కదా.. హ! అదేగా కనిపించేది.. అని భ్రమ పడితే మీరు పప్పులో కాలేసినట్టే.. అక్కడ ఈ ‘T’ అక్షరంతో పాటు మరో వర్డ్ ‘F’ కూడా దాగుంది. దాన్ని మీరు కనిపెట్టాలి. మీకున్న సమయం కేవలం 10 సెకన్లు మాత్రమే.. మీ బుర్రకు పదునుపెట్టి ఈ పజిల్ సాల్వ్ చేసేయండి. మేధావులు అయితే చిటికెలో దీని భరతం పడతారు. మరి మీ సంగతేంటి.. మీరూ మేధావులైతే.. సాల్వ్ చేసేయండి. ముందుగానే సమాధానం చూడొద్దు. కొంచెం తెలివితేటలు ఉపయోగించి.. ఈ పజిల్ సాల్వ్ చేయండి. లేదంటే అప్పుడు ఆన్సర్ చూడండి..
here is the answer pic.twitter.com/yhdFLIlcyi
— telugufunworld (@telugufunworld) August 28, 2023