AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిస్లరీ వాటర్ తాగుతున్నారా..? పరీక్షల్లో షాకింగ్ విషయాలు! విచారణకు FSSAI ఆదేశం!

ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లరీకి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రయోగశాల పరీక్షల్లో కంపెనీకి చెందిన వాటర్ శాంపిల్ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలడంతో, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) విచారణకు అనుమతి ఇచ్చింది. నీటిలో కొన్ని రసాయనాల పరిమితులు ఉల్లంఘించినట్లు పరీక్షల్లో వెల్లడవడంతో ఈ చర్య తీసుకుంది. అయితే, దీనిపై కంపెనీ వివరణ, తదుపరి విచారణ కీలకంగా మారాయి.

బిస్లరీ వాటర్ తాగుతున్నారా..? పరీక్షల్లో షాకింగ్ విషయాలు! విచారణకు FSSAI ఆదేశం!
Bisleri
Balaraju Goud
| Edited By: |

Updated on: Nov 22, 2026 | 11:15 PM

Share

ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లరీకి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రయోగశాల పరీక్షల్లో కంపెనీకి చెందిన వాటర్ శాంపిల్ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలడంతో, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) విచారణకు అనుమతి ఇచ్చింది. నీటిలో కొన్ని రసాయనాల పరిమితులు ఉల్లంఘించినట్లు పరీక్షల్లో వెల్లడవడంతో ఈ చర్య తీసుకుంది. అయితే, దీనిపై కంపెనీ వివరణ, తదుపరి విచారణ కీలకంగా మారాయి.

బిస్లరీ వాటర్‌లో ఏం గుర్తించారు?

బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణం నుంచి FSSAI అధికారులు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల్లో నీటిలో బ్రోమేట్ నిర్దేశిత పరిమితులను మించి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ నమూనాను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం–2006 ప్రకారం సురక్షితం కానిదిగా ప్రకటించారు. అయితే కంపెనీ ఈ పరీక్ష ఫలితాలపై అప్పీల్ చేయడంతో, నమూనాను మరో రెఫరల్ ల్యాబొరేటరీకి పంపించారు. అక్కడ నిర్వహించిన తదుపరి పరీక్షల్లో పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) గుర్తించినట్లు FSSAI వెల్లడించింది. ఈ నివేదిక కూడా ఆ నమూనా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని పేర్కొంది. దీంతో కంపెనీపై విచారణ ప్రారంభించేందుకు నియంత్రణ సంస్థ అనుమతించింది.

Fssai Approves Prosecution Against Bisleri

Fssai Approves Prosecution Against Bisleri

ఇతర కంపెనీలపైనా చర్యలు

బిస్లరీతో పాటు వసంత మసాలా, టిట్-బిట్ ఫుడ్స్ ఇండియా, మిమాన్సా ఇండస్ట్రీస్, ఆశా కన్ఫెక్షనరీ వంటి సంస్థలపై కూడా విచారణకు అనుమతించింది. నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో ఊర్మి లైఫ్‌సైన్సెస్, గౌర్ ఆయుర్వేదిక్ స్టోర్ లైసెన్సులను నిలిపివేసింది. అలాగే, ఆశా కన్ఫెక్షనరీకి చెందిన చాక్లెట్ ఫిల్లింగ్ కుకీలు సురక్షితం కాదని తేలడంతో వాటిని మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని (రీకాల్) ఆదేశించింది. ఆహార భద్రత విషయంలో తనిఖీలు, అమలు చర్యలను FSSAI మరింత వేగవంతం చేస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us