Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్ర స్పెషల్ గిఫ్ట్‌.. తానే స్వయంగా..!

ఎప్పుడూ కొత్త టాలెంట్స్‌కి సపోర్ట్ చేస్తూ భరోసాగా బహుమతులు ఇచ్చే ఆనంద్ మహీంద్రా ప్రజ్ఞానందకు కూడా ఓ పెద్ద గిఫ్ట్ ఇచ్చారు.. అవును, ఆనంద్ మహీంద్రా మహీంద్రా అదిరిపోయే బహుమతి ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ప్రజ్ఞానంద్‌కు థార్ కారును బహుమతిగా ఇవ్వమని పలువురు ఆనంద్ మహీంద్రాకు ట్వీట్ చేశారు. కారు ఇచ్చేందుకు అంగీకరించిన ఆనంద్ మహీంద్రా థార్‌కు బదులుగా ...

ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్ర స్పెషల్ గిఫ్ట్‌.. తానే స్వయంగా..!
Anand Mahindra Praggnanandh
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 29, 2023 | 9:00 AM

ఆటలో ఓడినా భారతీయుల హృదయాలను గెలుచుకున్న ప్రజ్ఞానంద గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సెన్ చెస్ ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలవగా, భారత యువ ఆటగాడు ఆర్ ప్రజ్ఞానంద రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. చెస్ ప్రపంచకప్‌లో 18 పరుగులతో ఓడిపోయినా భారతీయుల హృదయాలను గెలుచుకోవడంలో ప్రజ్ఞానంద విజయం సాధించాడు. ప్రజ్ఞానంద తల్లి కూడా సోషల్ మీడియాలో ఫేమస్‌గా మారారు. కొడుకు విజయాన్ని చూసి ఆ తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఎప్పుడూ కొత్త టాలెంట్స్‌కి సపోర్ట్ చేస్తూ భరోసాగా బహుమతులు ఇచ్చే ఆనంద్ మహీంద్రా ప్రజ్ఞానందకు కూడా ఓ పెద్ద గిఫ్ట్ ఇచ్చారు.. అవును, ఆనంద్ మహీంద్రా మహీంద్రా XUV400 EVని బహుమతిగా ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ప్రజ్ఞానంద్‌కు థార్ కారును బహుమతిగా ఇవ్వమని పలువురు ఆనంద్ మహీంద్రాకు ట్వీట్ చేశారు. కారు ఇచ్చేందుకు అంగీకరించిన ఆనంద్ మహీంద్రా థార్‌కు బదులుగా ఎక్స్‌యూవీ 400 ఈవీ కారును ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తల్లిదండ్రులు తమ పిల్లలకు చెస్‌ను పరిచయం చేయమని, వారు ఈ సెరిబ్రల్ గేమ్‌ను కొనసాగించేటప్పుడు వారికి మద్దతు ఇవ్వాలని నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. ఇది EVల మాదిరిగానే మన గ్రహం కోసం మెరుగైన భవిష్యత్తు కోసం పెట్టుబడి. కాబట్టి, తాను XUV4OO EVని తల్లిదండ్రులకు బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నట్టుగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..