Post Office RD vs SIP: ప్రతినెలా రూ. 5,000 డిపాజిట్ చేస్తే ఎందులో ఎంత డబ్బు లభిస్తుందో తెలుసా? పూర్తి వివరాలు మీకోసం..
Post Office RD vs SIP: మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? నెలకు రూ. 5,000 సేవ్ చేయాలని భావిస్తున్నారా? అయితే, ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టాలా? లేక SIP లో పెట్టుబడి పెట్టాలా? అనే ఆయోమయంలో ఉన్నారా? అయితే, మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవాళ మనం అదే విషయంలో క్లారిటీ తెచ్చుకుందాం. పోస్టాఫీస్ RD లేదా SIP లలో ఏది బెటర్? డబ్బును ఎందులో పెట్టుబడి పెట్టడం వలన ఉపయోగం ఉంటుంది? కీలక వివరాలు ఓసారి చూద్దాం.

ఆర్డీపై ఎంత వడ్డీ వస్తుంది: పెట్టుబడిదారులు పోస్ట్ ఆఫీస్ ఆర్డీపై 6.5 శాతం వడ్డీ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది. రికరింగ్ డిపాజిట్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఇందులో హామీతో కూడిన రాబడిని పొందుతారు. ఇక SIP విషయానికి వస్తే వడ్డీ ఎంత మొత్తంలో వస్తుంది? అనేది మాత్రం నిర్ణయించలేదు.
పోస్టాఫీసులో రూ. 5,000 ఆర్‌డీ చేస్తే..
5 సంవత్సరాలలో 3 లక్షల పెట్టుబడి ఉంటుంది. పోస్టాఫీసులో రూ. 5000 RD చేస్తే, ఒక సంవత్సరంలో సుమారు రూ. 60,000, 5 సంవత్సరాలలో సుమారు రూ. 3 లక్షల వరకు వస్తాయి. మీ పెట్టుబడిపై దాదాపు 6.5 శాతం వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. అంటే, మీరు పెట్టుబడి పెట్టిన మొత్తానికి వడ్డీగా రూ. 54,957 పొందుతారు. మెచ్యూరిటీలో, పెట్టుబడిదారులు రూ. 3,54,957 పొందుతారు.
SIPలో ఎంత ప్రయోజనం లభిస్తుంది?
మీరు పోస్ట్ ఆఫీస్ RD కి బదులుగా SIP లో ఇన్వెస్ట్ చేస్తే.. మీ మొత్తం పెట్టుబడి 3 లక్షలు అవుతుంది. అయితే, ఇందులో మీరు షేర్ మార్కెట్ ప్రకారం రాబడిని పొందుతారు. SIPపై రాబడి రేటు దాదాపు 12% అని ఎక్కువగా చూడవచ్చు. ఈ ప్రకారం.. మీరు సగటున 12% వడ్డీని పొందినట్లయితే, మీరు రూ. 3 లక్షలపై వడ్డీగా రూ.1,12,432 పొందుతారు.
SIPలో రిస్క్ ఉంటుంది..
ఈ విధంగా మీరు 5 సంవత్సరాల తర్వాత రూ. 4,12,432 పొందుతారు. SIPలో రాబడి మొత్తం స్థిరంగా ఉండదు. అది పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. మార్కెట్ రాబడుల ప్రకారం ఇది 14 నుంచి 18 శాతం కూడా ఉండొచ్చు. దీని ప్రకారం, RD తో పోలిస్తే SIP ఉత్తమ ఎంపిక. కానీ ఇందులో రిస్క్ కూడా ఉంది.
RD ప్రయోజనాలు ఏమిటి?
మీరు ప్రతి నెలా కొంచెం పెట్టుబడి పెట్టాలనుకుంటే.. FDకి బదులుగా SIP, RD లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. FDకి బదులుగా ఇవి ఉత్తమమైన ఎంపిక అని చెబుతున్నారు నిపుణులు. ఈ రెండు పథకాలలో, మీరు ప్రతి నెలా కొంత స్థిర మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. RD మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత, మీరు డిపాజిట్ మొత్తంతో పాటు వడ్డీ మొత్తాన్ని తిరిగి పొందుతారు. మళ్లీ దీనిని తిరిగి దేనికైనా ఉపయోగించొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..