- Telugu News Photo Gallery Cinema photos Tamil Movie Titles Effect on Tollywood Market Telugu Entertainment Photos
Tamil Movies in Tollywood: తెలుగు ఇండస్ట్రీపై తమిళ హీరోల చిన్న చూపు.! ఆ విషయంలో ఫైర్..
తెలుగు మార్కెట్ కావాలి కానీ తెలుగు టైటిల్ మాత్రం వద్దా..? తమిళ హీరోలను మన ఆడియన్స్ అడుగుతున్న ప్రశ్న ఇదే. దానికి సమాధానం ఎవరు చెప్తారో తెలియదు కానీ.. టాలీవుడ్‌ను మాత్రం వాళ్లు టేక్ ఇన్ గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారని అర్థమవుతుంది. డబ్బింగ్ చేస్తున్నపుడు కనీసం ఓ తెలుగు టైటిల్ పెట్టలేకపోతున్నారా..? టాలీవుడ్ అంటే ఎందుకంత చిన్నచూపు..? ఇండియాలో ఉన్న ప్రతి హీరోకు తెలుగు మార్కెట్ కావాలిపుడు. ఇక్కడ మార్కెట్ సంపాదిస్తే ఇండియాపై పట్టు సాధించినట్లే.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Anil kumar poka
Updated on: Oct 29, 2023 | 6:57 PM

తెలుగు మార్కెట్ కావాలి కానీ తెలుగు టైటిల్ మాత్రం వద్దా..? తమిళ హీరోలను మన ఆడియన్స్ అడుగుతున్న ప్రశ్న ఇదే. దానికి సమాధానం ఎవరు చెప్తారో తెలియదు కానీ.. టాలీవుడ్‌ను మాత్రం వాళ్లు టేక్ ఇన్ గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారని అర్థమవుతుంది.

డబ్బింగ్ చేస్తున్నపుడు కనీసం ఓ తెలుగు టైటిల్ పెట్టలేకపోతున్నారా..? టాలీవుడ్ అంటే ఎందుకంత చిన్నచూపు..? ఇండియాలో ఉన్న ప్రతి హీరోకు తెలుగు మార్కెట్ కావాలిపుడు. ఇక్కడ మార్కెట్ సంపాదిస్తే ఇండియాపై పట్టు సాధించినట్లే.

అయితే మార్కెట్‌పై చూపించిన శ్రద్ధ తమ టైటిల్స్‌పై చూపించట్లేదు కొందరు. ముఖ్యంగా తమిళ హీరోలైతే టాలీవుడ్‌ను అత్తగారిల్లులా ఫీల్ అవుతూ.. అరవ టైటిల్స్‌తోనే తెలుగులోకి వస్తున్నారు. వాటి అర్థాలేంటో కూడా ఎవరికీ తెలియదు. దీనిపై చర్చ మొదలైందిప్పుడు.

తాజాగా శివకార్తికేయన్ అయలాన్ సినిమా అదే టైటిల్‌తోనే తెలుగులోనూ వస్తుంది. మీకు తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చే డబ్బులు కావాలి.. కానీ తెలుగు ప్రేక్షకుల మనోభావాలతో మాత్రం పని లేదా అనే అంతే కదా..

అందుకే కదా తమిళ టైటిల్ అలాగే తెలుగులో పెట్టి విడుదల చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. సూర్య కంగువాకు ఇదే జరుగుతుంది. సంక్రాంతికి అజిత్ తునివును అదే పేరుతో విడుదల చేశారు.

తునివు అంటే తెగింపు అని అర్థం.. చక్కగా అదే పేరు పెట్టి విడుదల చేయొచ్చు కానీ చేయలేదు. గతేడాది సూర్య ఈటీది ఇదే పరిస్థితి. ఇప్పుడు విక్రమ్ తంగలాన్ అంటున్నారు. ప్రభుదేవా అయితే దారుణంగా ఉల్ఫా అంటూ వచ్చారు. తెలుగులో ఇంత మార్కెట్ ఉన్నా టైటిల్ దగ్గర ఎందుకిలా చేస్తున్నారనేది వాళ్లకే తెలియాలి మరి..!





























