Adrishya Jalakangal OTT: ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. తెలుగులో కూడా స్ట్రీమింగ్‌.. ఎప్పుడంటే?

మలయాళంలో వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయిన టొవినో థామస్‌ నటించిన మరో డిఫరెంట్‌ మూవీ అదృశ్య జలకంగల్. నిమిషా సజయన్. ఇంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్‌ 24న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లే సాధించింది. టాలీవుడ్‌ కు చెందిన మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ మూవీని నిర్మించడం విశేషం.

Adrishya Jalakangal OTT: ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. తెలుగులో కూడా స్ట్రీమింగ్‌.. ఎప్పుడంటే?
Adrishya Jalakangal movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 06, 2023 | 7:09 PM

ఈ ఏడాది మలయాళంలో రిలీజైన బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో 2018 మూవీ మొదటి స్థానంలో ఉంటుంది. టొవినో థామస్‌ హీరోగా నటించిన ఈ ఎమోషనల్‌ ఎంటర్‌ టైనర్‌ తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా టొవినో థామస్‌ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. స్ట్రాంగ్‌ కంటెంట్‌ ఉండడంతో ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డుల బరిలో నిలిచింది 2018 సినిమా. మలయాళంలో వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయిన టొవినో థామస్‌ నటించిన మరో డిఫరెంట్‌ మూవీ అదృశ్య జలకంగల్. నిమిషా సజయన్. ఇంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్‌ 24న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లే సాధించింది. టాలీవుడ్‌ కు చెందిన మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ మూవీని నిర్మించడం విశేషం. థియేటర్‌ ఆడియెన్స్‌ను అలరించిన అదృశ్య జలకంగల్ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సూపర్‌ హిట్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. సూపర్‌ హిట్‌ టాక్‌ వచ్చినప్పటికీ రెండు వారాల్లోకే అదృశ్య జలకంగల్‌ సినిమాను ఓటీటీలోకి తీసుకురానుంది నెట్‌ఫ్లిక్స్‌. డిసెంబర్‌ 8 నుంచి టొవినో థామస్‌ సూపర్‌ హిట్‌ మూవీని డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కానుంది. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

జాతీయ అవార్డు గ్రహీత డా. బిజుకుమార్ దామోధరన్ అపూర్వ జలకంగల్‌ సినిమాను తెరకెక్కించారు. వార్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ మూవీ రూపొందింది. రిక్కీ కేజ్‌ స్వరాలు సమకూర్చారు. సినిమాల్లోనూ, రియల్‌ లైఫ్‌లోనూ ఎంతో హ్యాండ్సమ్‌గా కనిపించే టొవినో థామస్‌ ఈ మూవీలో డీ గ్లామర్‌ లుక్‌లో ఎంతో అమాయకుడిగా కనిపించడం విశేషం. అంతేకాదు అపూర్వ జలకంగల్‌ సినిమా కోసం ఏకంగా 15 కిలోలు తగ్గిపోయాడీ స్టార్‌ హీరో. మరి ఈ వారం మంచి ఎమోషనల్‌ మూవీ చూడాలనుకుంటున్నారా? అయితే అపూర్వ జలకంగల్‌ మీకు మంచి ఛాయిస్‌.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

15 కిలోలు తగ్గి.. డీ గ్లామర్ లుక్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.