Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌ ఓటింగ్‌.. అమర్‌కు షాక్‌.. ఎలిమినేట్‌ అయ్యేది ఎవరంటే?

ఇక 14వ వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఈ వారం ఓటింగ్‌ విషయంలో బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఈ వారం నుంచే బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌ ఓటింగ్‌ను షురూ చేశారు. అంటే ఆడియెన్స్‌ ఎవరినైతే గెలిపించాలనుకుంటున్నారో వాళ్లకు ఇప్పటి నుంచే ఓట్లు వేయచ్చన్న మాట.

Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌ ఓటింగ్‌.. అమర్‌కు షాక్‌.. ఎలిమినేట్‌ అయ్యేది ఎవరంటే?
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Dec 05, 2023 | 5:55 PM

బుల్లితెర ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంటోన్న బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే సక్సెస్‌ ఫుల్‌గా 13 వారాలు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్‌ షోకు త్వరలోనే ఎండ్‌ కార్డ్‌ పడనుంది. ఇప్పటికే హౌజ్‌లో ఫినాలే టాస్కులు కూడా హోరాహోరీగా సాగుతున్నాయి.13 వ వారంలో గౌతమ్‌ ఎలిమినేట్‌ కాగా, 14 వారంలో ఎవరు హౌజ్‌ నుంచి బయటకు వెళతారన్నది ఆసక్తిగా మారింది. అదే సమయంలో ఎలిమినేషన్‌ ఉంటుందా? లేదా? అన్నది కూడా ఇంట్రెస్టింగ్‌. ఎందుకంటే టాప్‌-7 కంటెస్టెంట్స్‌తోనే గ్రాండ్‌ ఫినాలేను నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఈ వారం ఎలిమినేషన్ ఉండదని తెలుస్తోంది. ఇక 14 వారంలో నామినేషన్స్‌లో శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్ చౌదరి, ప్రియాంక జైన్, శోభా శెట్టి ఉన్నారు. అంబటి అర్జున్‌ ఎలాగో ఇప్పటికే ఫినాలేలోకి వెళ్లిపోయాడు. ఇక 14వ వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఈ వారం ఓటింగ్‌ విషయంలో బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఈ వారం నుంచే బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌ ఓటింగ్‌ను షురూ చేశారు. అంటే ఆడియెన్స్‌ ఎవరినైతే గెలిపించాలనుకుంటున్నారో వాళ్లకు ఇప్పటి నుంచే ఓట్లు వేయచ్చన్న మాట.

ఎప్పటిలాగే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ 14 వారం బిగ్‌ బాస్‌ ఓటింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని తర్వాత స్థానంలో బిగ్‌ బాస్‌ పెద్దన్న శివాజి కొనసాగుతున్నాడు. ఇక మూడో స్థానంలో ప్రిన్స్ యావర్ ఉన్నాడు. అయితే టైటిల్‌ ఫేవరేట్‌గా ఉన్న అమర్‌ దీప్‌ చౌదరి ఈ వీక్‌ ఓటింగ్‌లో వెనక బడ్డాడు. ప్రస్తుతం అతను నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇది అమర్‌ ఫ్యాన్స్‌కు షాకేనని చెప్పుకోవచ్చు. ఇక ఐదో స్థానంలో అర్జున్‌ అంబటి కొనసాగుతున్నాడు. అయితే అతను నామినేషన్స్‌లో లేకపోవడంతో ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్‌ లేదు. ఇక ఆరో స్థానంలో ప్రియాంక జైన్‌, ఏడో ప్లేస్‌లో శోభా శెట్టి ఉన్నారు. అంటే ప్రస్తుతం డేంజర్‌ జోన్‌లో ఉన్నది ప్రియాంక, శోభా శెట్టినే. ఒక వేళ ఎలిమినేషన్‌ ఉంటే ఈ లేడీస్‌లో ఒకరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశముంది. ఓటింగ్‌కు ఇంకా చాలా సమయముంది కాబట్టి మరి ఈ జాబితాలో ఏమైనా మార్పులు జరుగుతాయా? లేదా? అన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..