Bigg Boss 7 Telugu: రైతుబిడ్డకు బంపరాఫర్‌.. పవన్‌ కల్యాణ్‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన పల్లవి ప్రశాంత్‌

ఈ సారి బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌ ఇతనేనంటూ పలువురి పేర్లు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు రైతు బిడ్డ అలియాస్‌ పల్లవి ప్రశాంత్‌. ఒక కామన్‌ మ్యాన్‌గా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్‌ బిగ్‌ బాస్‌ టాప్‌ కంటెస్టెంట్స్‌లో ఒకటిగా నిలిచాడు. తనదైన ఆటతీరుతో బుల్లితెర అభిమానుల మనసులు గెల్చుకున్నాడు. ఇక హౌజ్‌ బయట కూడా పల్లవి ప్రశాంత్‌కు భారీగా మద్దతు లభిస్తోంది. సోషల్‌ మీడియాలో అతని పేరు మార్మోగిపోతోంది.

Bigg Boss 7 Telugu: రైతుబిడ్డకు బంపరాఫర్‌.. పవన్‌ కల్యాణ్‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన పల్లవి ప్రశాంత్‌
Pallavi Prashant, Pawan Kalyan
Follow us

|

Updated on: Dec 03, 2023 | 5:57 PM

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ దాదాపు తుది అంకానికి చేరుకుంది. డిసెంబర్‌ 17న బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే జరగనుందని తెలుస్తోంది. అప్పుడే ఈ సారి బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌ ఇతనేనంటూ పలువురి పేర్లు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు రైతు బిడ్డ అలియాస్‌ పల్లవి ప్రశాంత్‌. ఒక కామన్‌ మ్యాన్‌గా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్‌ బిగ్‌ బాస్‌ టాప్‌ కంటెస్టెంట్స్‌లో ఒకటిగా నిలిచాడు. తనదైన ఆటతీరుతో బుల్లితెర అభిమానుల మనసులు గెల్చుకున్నాడు. ఇక హౌజ్‌ బయట కూడా పల్లవి ప్రశాంత్‌కు భారీగా మద్దతు లభిస్తోంది. సోషల్‌ మీడియాలో అతని పేరు మార్మోగిపోతోంది. పలువురు సినీ ప్రముఖులు కూడా రైతుబిడ్డ ఆటతీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలో పల్లవి ప్రశాంత్‌ కు సంబంధించి ఒక వార్త సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమాలో రైతు బిడ్డకు అవకాశం వచ్చిందనేది ఈ వార్త సారాంశం. పవన్‌- హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలో పల్లవి ప్రశాంత్‌ నటించనున్నాడని టాలీవుడ్‌ మీడియా సర్కిళ్లలో టాక్‌ వినిపిస్తోంది.

డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ బిగ్‌ బాస్‌ తెలుగు రియాలిటీ షోను రెగ్యులర్‌గా ఫాలో అవుతారంట. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ గేమ్‌ డైరెక్టర్‌కు బాగా నచ్చేసిందట. అందుకే పవన్‌ కల్యాణ్ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలో తనకు ఒక పాత్ర ఇవ్వాలని ఫిక్స్‌ అయ్యారట. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో గెస్ట్‌గా వచ్చి హరీష్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఈ విషయం తెలిసి రైతు బిడ్డ ఫ్యాన్స్‌ ఎగిరి గంతేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌజ్ లో పల్లవి ప్రశాంత్..

ప్రేమకథను బయటపెట్టిన పల్లవి ప్రశాంత్..

ఉస్తాద్ మూవీలో స్పెషల్ రోల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కారులో వెళ్తూ వరదలో చిక్కుకున్న దంపతులు.. చివరకు ఏం జరిగిందంటే
కారులో వెళ్తూ వరదలో చిక్కుకున్న దంపతులు.. చివరకు ఏం జరిగిందంటే
పటౌడీ ప్రిన్సెస్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..
పటౌడీ ప్రిన్సెస్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..
హైదరాబాద్‌లో స్థలాలు, ఇళ్లు కొంటున్నారా.?ఇవిగో హైడ్రా కీలక సూచనలు
హైదరాబాద్‌లో స్థలాలు, ఇళ్లు కొంటున్నారా.?ఇవిగో హైడ్రా కీలక సూచనలు
సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరదలో కొట్టుకుపోయిన రైతులు
సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరదలో కొట్టుకుపోయిన రైతులు
హెచ్‌డీ‌ఎఫ్‌సీ వినియోగదారులకు అలర్ట్.. రుణాల వడ్డీ రేట్లలో..
హెచ్‌డీ‌ఎఫ్‌సీ వినియోగదారులకు అలర్ట్.. రుణాల వడ్డీ రేట్లలో..
తగ్గేదే లే.. ఫ్యాన్స్ కోసం ఎలాంటి పాత్రలకైనా రెడీ..
తగ్గేదే లే.. ఫ్యాన్స్ కోసం ఎలాంటి పాత్రలకైనా రెడీ..
శివబాలాజీ ఫిర్యాదుతో ఆ యూట్యూబర్‏ను అరెస్ట్ చేసిన పోలీసులు..
శివబాలాజీ ఫిర్యాదుతో ఆ యూట్యూబర్‏ను అరెస్ట్ చేసిన పోలీసులు..
ఇవి ఇంట్లో ఉంటే ఆరోగ్యం మన ఒంట్లో ఉన్నట్టే.. భారీ డిస్కౌంట్ ఉంది
ఇవి ఇంట్లో ఉంటే ఆరోగ్యం మన ఒంట్లో ఉన్నట్టే.. భారీ డిస్కౌంట్ ఉంది
WhatsApp groupలో పోస్ట్‌ డిలీట్‌.. స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అరెస్ట్!
WhatsApp groupలో పోస్ట్‌ డిలీట్‌.. స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అరెస్ట్!
చల్లని వర్షంలో వేడివేడి పెసరపప్పు పకోడీలు..
చల్లని వర్షంలో వేడివేడి పెసరపప్పు పకోడీలు..