- Telugu News Photo Gallery Cinema photos Jabardasth Comedian Kiraak RP marriage to Lakshmi Prasanna both share wedding Photos
Kirak RP: కిర్రాక్ ఆర్పీ, లక్ష్మీ ప్రసన్నల పెళ్లి ఫొటోలు చూశారా? జంట ఎంత అందంగా ఉందో..
కిర్రాక్ ఆర్పీ అలియాస్ రాటకొండ ప్రసాద్ తన బ్యాచిలర్ లైఫ్‌కి బై బై చెప్పాడు. లక్ష్మీ ప్రసన్నతో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టాడు. బుధవారం (నవంబర్29 వైజాగ్ వేదికగా వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది.
Updated on: Dec 01, 2023 | 1:48 PM

ర్రాక్ ఆర్పీ అలియాస్ రాటకొండ ప్రసాద్ తన బ్యాచిలర్ లైఫ్‌కి బై బై చెప్పాడు. లక్ష్మీ ప్రసన్నతో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టాడు. బుధవారం (నవంబర్29 వైజాగ్ వేదికగా వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది.

కిర్రాక్ ఆర్పీ, లక్ష్మీ ప్రసన్నలది ప్రేమ వివాహం. గత కొంత కాలంగా వీరిద్దరూ లవ్ లో ఉన్నారు. ఇరు కుటుంబ సభ్యులు కూడా ఆశీర్వదించడంతో గతేడాది ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.

ఇప్పుడు వైహిహిక బంధంలోకి అడుగుపెట్టి తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. కిర్రాక్ ఆర్పీ, లక్ష్మీల వివాహ వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.

ఇదిలా ఉంటే తాజాగా తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆర్పీ సతీమణి లక్ష్మీ ప్రసన్న. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నూతన వధూవరులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

తనదైన పంచులు, ప్రాసలతో జబర్దస్త్ షోలో స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు కిర్రాక్ ఆర్పీ. ఇప్పుడు నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు వ్యాపారంతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు.

ఇప్పటికే హైదరాబాద్‌లో పలు చోట్ల బ్రాంచ్ లు ఓపెన్ చేసిన ఆర్పీ ఇటీవలే నెల్లూరులోనూ తన చేపల పులుసు సెంటర్ ప్రారంభించాడు. ప్రముఖ నటి, మంత్రి రోజా చేతుల మీదుగా ఈ కర్రీ పాయింట్ ఓపెనింగ్ వేడుకగా జరిగింది.





























