టిక్ టాక్ వీడియోస్, రీల్స్‌తో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది నయని పావని. ఆ తర్వాత యూట్యూబ్‌తో షార్ట్‌ఫిల్మ్స్ చేస్తూ ఫాలోయింగ్ సంపాదించుకుంది. చిత్తం మహారాణి, సూర్యకాంతం వంటి సినిమాల్లో నటించి అలరించింది. బుల్లితెరపై డాన్స్ షో ఢీ సీజన్ 15లో పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి అడుగుపెట్టింది తన ఆట తీరుతో.. మాటలతో ఆకట్టుకుంది.