Bigg Boss 7 Telugu: బిగ్‌ ట్విస్ట్‌.. 24 గంటల్లో మారిపోయిన ఓటింగ్‌ లెక్కలు.. డేంజర్‌ జోన్‌లోకి శోభతో పాటు..

ఈ వీక్‌ నామినేషన్స్‌లో ఏకంగా ఏడుగురు కంటెస్టెంట్స్‌ ఉన్నారు. అమర్‌ దీప్‌ చౌదరి మినహా శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్‌ యావర్‌, ప్రియాంక జైన్‌, శోభా శెట్టి, అర్జున్‌ అంబటి, గౌతమ్‌ కృష్ణ నామినేషన్స్‌లో నిలిచారు. ఇక ఓటింగ్‌ విషయానికొస్తే.. గత మూడు రోజులుగా ఉన్న లెక్కలు సడెన్‌గా మారిపోయాయి.

Bigg Boss 7 Telugu: బిగ్‌ ట్విస్ట్‌.. 24 గంటల్లో మారిపోయిన ఓటింగ్‌ లెక్కలు.. డేంజర్‌ జోన్‌లోకి శోభతో పాటు..
Bigg Boss 7 Telugu
Follow us

|

Updated on: Dec 01, 2023 | 10:46 AM

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ ఆఖరి అంకానికి చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ సెలబ్రిటీ గేమ్‌ షోకు ఎండ్‌ కార్డ్‌ పడనుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం డిసెంబర్‌ 17న బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే జరగనుందని సమాచారం. ఈ కారణంగానే టికెట్‌ టు ఫినాలే రేస్‌ కూడా ప్రారంభమైంది. మరోవైపు 13 వారంలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారన్నది ఆసక్తిగా మారింది. ఈ వీక్‌ నామినేషన్స్‌లో ఏకంగా ఏడుగురు కంటెస్టెంట్స్‌ ఉన్నారు. అమర్‌ దీప్‌ చౌదరి మినహా శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్‌ యావర్‌, ప్రియాంక జైన్‌, శోభా శెట్టి, అర్జున్‌ అంబటి, గౌతమ్‌ కృష్ణ నామినేషన్స్‌లో నిలిచారు. ఇక ఓటింగ్‌ విషయానికొస్తే.. గత మూడు రోజులుగా ఉన్న లెక్కలు సడెన్‌గా మారిపోయాయి. 24 గంటల్లోనే అట్టడుగున ఉన్న కంటెస్టెంట్లు ఒక్కసారిగా టాప్‌ లోకి వచ్చేశారు. అలాగే స్ట్రాంగ్‌ హౌజ్‌ మేట్స్‌ అనుకున్న వారు డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిపోయారు.

ఎప్పటిలాగే పల్లవి ప్రశాంత్, శివాజీలకు భారీగా ఓట్లు పడుతున్నాయి. ఇప్పటివరకు ప్రశాంత్‌ కు 27 శాతం ఓట్లు పడగా, శివాజీకి 22 శాతం ఓట్లు పోలయ్యాయి. 13 శాతం ఓట్లతో ప్రిన్స్‌ యావర్‌ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే నిన్నటి వరకు ఆఖరి స్థానంలో ఉన్న గౌతమ్‌ ఇప్పుడు ఏకంగా నాలుగో స్థానంలోకి వచ్చేశాడు. అతని ఖాతాలో 11 శాతం ఓట్లు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో అర్జున్‌ అంబటి (10 శాతం ఓట్లు) ఉన్నాడు. ఇక ఆరో స్థానంలో ప్రియాంక జైన్‌ ( 7 శాతం ఓట్లు), ఏడో స్థానంలో శోభా శెట్టి (6.9 శాతం) ఉన్నారు. అంటే ప్రస్తుతం ప్రియాంక, శోభా డేంజర్‌ జోన్‌లు ఉన్నారన్నమాట. మరి శోభను బిగ్‌ బాస్‌ ఎలిమినేట్‌ చేస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ వారం కూడా ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఎవిక్షన్ పాస్ ను ఉపయోగించవచ్చని సమాచారం.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ ఓటింగ్ లేటెస్ట్ రిజల్ట్స్..

బిగ్ బాస్ హౌజ్ లో ప్రియాంక జైన్..

బిగ్ బాస్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.