Maanas: చూడముచ్చటైన జంట.. పెళ్లి వీడియోలు, ఫొటోలు షేర్‌ చేసిన బ్రహ్మముడి ఫేం మానస్‌.. మీరు చూశారా?

ప్రముఖ నటుడు, బ్రహ్మముడి ఫేమ్‌ మానస్‌ ఇటీవలే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. చెన్నైకు శ్రీజతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. విజయవాడలోని మురళీ రిసార్ట్స్‌ వేదికగా నవంబర్‌ 22న వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో శ్రీజ మెడలో మూడు ముళ్లు వేశాడు మానస్‌.

Maanas: చూడముచ్చటైన జంట.. పెళ్లి వీడియోలు, ఫొటోలు షేర్‌ చేసిన బ్రహ్మముడి ఫేం మానస్‌.. మీరు చూశారా?
Maanas, Srija Nissankara
Follow us
Basha Shek

|

Updated on: Nov 30, 2023 | 1:27 PM

ప్రముఖ నటుడు, బ్రహ్మముడి ఫేమ్‌ మానస్‌ ఇటీవలే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. చెన్నైకు శ్రీజతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. విజయవాడలోని మురళీ రిసార్ట్స్‌ వేదికగా నవంబర్‌ 22న వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో శ్రీజ మెడలో మూడు ముళ్లు వేశాడు మానస్‌. సినీ పరిశ్రమకు చెందిన నటీనటులతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తాజాగా తన అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశాడు మానస్‌. వివాహ వేడుకతో పాటు హల్దీ, సంగీత్‌ వంటి ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోస్‌, వీడియోలను ఇన్‌ స్టాలో షేర్‌ చేసుకున్నాడీ బిగ్‌ బాస్‌ యాక్టర్‌. దీంతో ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సినీ ప్రముఖులు, బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు మానస్‌-శ్రీజ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మానస్‌-శ్రీజల పెళ్లి వేడుకల్లో బిగ్‌ బాస్‌ కంఎటస్టెంట్స్‌ ఆర్జే కాజల్‌, శుభ శ్రీ రాయగురు, హమీదా, టేస్టీ తాజాతో పాటు తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక మానస్‌ విషయానికి వస్తే.. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించాడు. సోడా గాలిసోడా, ప్రేమికుడు, గ్యాంగ్‌ ఆఫ్‌ గబ్బర్‌ సింగ్‌, కాయ్‌ రాజా కాయ్‌ తదితర సినిమాల్లో స్పెషల్‌ రోల్స్‌తో మెప్పించాడు. అలాగే బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

 మానస్- శ్రీజల పెళ్లి వేడుక

 హల్దీ వేడుక..

ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో ..

మానస్ నటించిన మాన్షన్ 24 వెబ్ సిరీస్ ఇటీవలే స్ట్రీమింగ్ కు వచ్చిన సంగతి తెలిసిందే. హార్రర్ థ్రిల్లర్  గా తెరకెక్కిన ఈ సిరీస్ లో మానస్ ఓ కీ రోల్ పోషించాడు. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!