AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiana Jones 5 OTT: ఓటీటీలో ఫ్రీగా ఇండియానా జోన్స్‌ 5.. తెలుగులో కూడా స్ట్రీమింగ్.. ఎప్పుడు, ఎక్కడంటే?

ఇండియానా జోన్స్‌ సిరీస్‌ నుంచి చివరిగా 2008లో కింగ్‌డమ్ ఆఫ్ ది క్రిస్టల్ స్కల్ వచ్చింది. ఇటీవలే సుమారు 42 ఏళ్ల తర్వాత ఇండియనా జోన్స్‌ సిరీస్‌ నుంచి కొత్త సినిమా వచ్చింది. అదే ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ. గత సిరీస్‌ సినిమాల్లాగే ఇది కూడా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. జూన్‌ 29న థియేటర్లలో రిలీజైన ఇండియానా జోన్స్‌ 5 బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.2వేల కోట్లు రాబట్టింది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ..

Indiana Jones 5 OTT: ఓటీటీలో ఫ్రీగా ఇండియానా జోన్స్‌ 5.. తెలుగులో కూడా స్ట్రీమింగ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
ndiana Jones and the Dial of Destiny Movie
Basha Shek
|

Updated on: Nov 29, 2023 | 8:52 PM

Share

హాలీవుడ్‌లో యాక్షన్‌, అడ్వెంచర్‌ చిత్రాల్లో ఇండియానా జోన్స్‌ సిరీస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో వచ్చిన ఐదు చిత్రాలు సినిమా ప్రియులను ఎంతగానో అలరించాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. అంతర్జాతీయంగానూ అవార్డుల పంట పండించాయి. ఇండియానా జోన్స్‌ సిరీస్‌ సినిమాలకు తెలుగులోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. 1981లో ఇండియా జోన్స్ అండ్ రైడర్స్ అఫ్ ది లాస్ట్ ఆర్క్ పేరుతో ఈ సిరీస్‌లో మొదటి సినిమా వచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ఇండియానా జోన్స్ అండ్‌ టెంపుల్ ఆఫ్ డూమ్, లాస్ట్ క్రూసేడ్ కింగ్‌డ‌మ్ ఆఫ్ ది క్రిస్ట‌ల్ స్క‌ల్ సినిమాలు కూడా సూపర్‌ హిట్‌గా నిలిచాయి. వీటన్నింటినీ బాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు స్టీవెల్ స్పీల్‌ బర్గ్‌ తెరకెక్కించడం విశేషం. కాగా ఇండియానా జోన్స్‌ సిరీస్‌ నుంచి చివరిగా 2008లో కింగ్‌డమ్ ఆఫ్ ది క్రిస్టల్ స్కల్ వచ్చింది. ఇటీవలే సుమారు 42 ఏళ్ల తర్వాత ఇండియనా జోన్స్‌ సిరీస్‌ నుంచి కొత్త సినిమా వచ్చింది. అదే ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ. గత సిరీస్‌ సినిమాల్లాగే ఇది కూడా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. జూన్‌ 29న థియేటర్లలో రిలీజైన ఇండియానా జోన్స్‌ 5 బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.2వేల కోట్లు రాబట్టింది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సూపర్‌ హిట్‌ మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 1 నుంచి ఉచితంగా అందుబాటులోకి రానుంది.

ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఇండియానా జోన్స్‌ 5 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీలో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌లో మాత్రం ఉచితంగా చూడవచ్చు. జేమ్స్ మాన్ గోల్డ్ తెరకెక్కించిన ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ సినిమాలో హ్యారీసన్ ఫోర్డ్, ఫోబే వాలర్, మాడ్స్ కిక్కెల్సన్, ఆంటోనియో బండేరాస్, బాడీ హల్ర్బూక్, థామస్ క్రెచ్ మ్యాన్, కరెన్ అలెన్, మార్క్ కిలీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

ఉచితంగా స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us