Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chinna OTT: ఓటీటీలోకి వచ్చేసిన సిద్ధార్థ్‌ సూపర్‌ హిట్‌ మూవీ.. ‘చిన్నా’ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

తెలుగులో వారం ఆలస్యంగా (అక్టోబర్‌ 6)న విడుదలైన చిన్నా సినిమాకు ఇక్కడ కూడా మంచి వసూళ్లు వచ్చాయి. దీంతో సిద్ధార్థ్‌ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట నవంబర్‌ 17నే చిన్నా మూవీ స్ట్రీమింగ్‌ అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే అదేమీ జరగలేదు. ఆ తర్వాత నవంబర్‌ 23న సిద్ధార్థ్‌ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందని రూమర్స్‌ వచ్చాయి. అప్పుడు కూడా రాలేదు

Chinna OTT: ఓటీటీలోకి వచ్చేసిన సిద్ధార్థ్‌ సూపర్‌ హిట్‌ మూవీ.. 'చిన్నా' స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
Siddharth Chinna Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 28, 2023 | 7:55 AM

టాలీవుడ్ రొమాంటిక్‌ హీరో సిద్ధార్థ్‌ నటించిన చిత్రం చిత్తా. తెలుగులో చిన్నాగా విడుదలైంది. సెప్టెంబర్‌ 28న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. సిద్ధార్థ్‌ గత సినిమాలకు భిన్నంగా, ఎమోషనల్‌గా ఉండడంతో లెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. మూవీలో సిద్ధార్థ్‌ యాక్టింగ్‌ కన్నీళ్లు తెప్పించిందంటూ చాలామంది చెప్పుకొచ్చారు. తెలుగులో వారం ఆలస్యంగా (అక్టోబర్‌ 6)న విడుదలైన చిన్నా సినిమాకు ఇక్కడ కూడా మంచి వసూళ్లు వచ్చాయి. దీంతో సిద్ధార్థ్‌ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట నవంబర్‌ 17నే చిన్నా మూవీ స్ట్రీమింగ్‌ అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే అదేమీ జరగలేదు. ఆ తర్వాత నవంబర్‌ 23న సిద్ధార్థ్‌ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందని రూమర్స్‌ వచ్చాయి. అప్పుడు కూడా రాలేదు. అయితే ఎట్టకేలకు సిద్ధార్థ్‌ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. మంగళవారం (నవంబర్‌ 28)న సిద్ధార్థ్‌ మూవీ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌ చిన్నామూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, కన్నడ భాషల్లో సిద్ధార్థ్‌ మూవీ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.

ఎస్‍ యూ అరుణ్ కుమార్ తెరకెక్కించిన చిన్నా సినిమాలో సిద్ధార్థ్‌తో పాటు నిమిషా విజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ కీలక పాత్రలు పోషించారు. చైల్డ్ అబ్యూజింగ్, హరాస్మెంట్‌ వంటి సున్నితమైన అంశాలను ఎంతో ఎమోషనల్‌గా చూపించారీ సినిమాలో. హీరో సిద్ధార్థ్‌ స్వయంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇక సిద్ధార్థ్‌ చిన్నా మూవీ కథ విషయానికి వస్తే.. అన్నయ్య చనిపోవడంతో వదిన, పాపను తానే చూసుకుంటుంటాడు ఈశ్వర్‌ (సిద్ధార్థ్‌). ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ వారిద్దరిని పోషిస్తుంటాడు. అయితే నగరంలో చిన్న పిల్లలు వరుసగా కిడ్నాప్‌లకు గురవుతారు. వారిని అత్యాచారం చేసి దారుణంగా చంపుతుంటారు. ఈశ్వర్‌పై కూడా ఇలాంటి ఆరోపణలు రావడంతో పోలీసులు అతనిని అరెస్ట్‌ చేస్తారు. ఇదే సమయంలో ఈశ్వర్‌ కుమార్తె కూడా అపహరణకు గురవుతుంది. మరి హీరో తన అన్న కూతురును వెతికి పట్టుకున్నాడా? లేదా? అన్నదే చిన్నా సినిమా కథ. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యింటే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..