AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhagavanth Kesari: బాలయ్య సినిమాకు బ్లాక్‌ బస్టర్‌ రెస్పాన్స్‌.. అనిల్‌ రావిపూడికి ఖరీదైన కారు గిఫ్ట్‌..

యేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన భగవంత్ కేసరి ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొడుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోన్న బాలయ్య మూవీకి భారీ రెస్పాన్స్‌ వస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ వెర్షన్స్‌ అమెజాన్‌ టాప్‌ లో కొనసాగుతున్నాయి.

Bhagavanth Kesari: బాలయ్య సినిమాకు బ్లాక్‌ బస్టర్‌ రెస్పాన్స్‌.. అనిల్‌ రావిపూడికి ఖరీదైన కారు గిఫ్ట్‌..
Director Anil Ravipudi
Basha Shek
|

Updated on: Nov 28, 2023 | 10:54 AM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ- డైరెక్టర్‌ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం భగవంత్‌ కేసరి. దసరా కానుకగా అక్టోబర్‌ 19న థియేటర్లలో విడుదలైన ఈ కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ.135 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన భగవంత్ కేసరి ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొడుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోన్న బాలయ్య మూవీకి భారీ రెస్పాన్స్‌ వస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ వెర్షన్స్‌ అమెజాన్‌ టాప్‌ లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం భగవంత్‌ కేసరి తెలుగు వెర్షన్‌ అమెజాన్‌ ప్రైమ్‌ టాప్‌ వన్‌లో ట్రెండింగ్ అవుతోంది. అలాగే హిందీ వెర్షన్‌ టాప్‌-3లో నిలచింది. ఈ విషయాన్ని తెలుపుతూ అమెజాన్‌ ప్రైమ్‌ ఒక స్పెషల్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇలా థియేటర్లు, ఇప్పుడు ఓటీటీలోనూ భగవంత్‌ కేసరి రికార్డులు కొల్లగొడుతుండడంతో చిత్ర బృందం సంతోషంలో మునిగి తేలుతోంది. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ షైన్​ స్క్రీన్స్​ దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. సినిమా సూపర్ హిట్ కావడంతో దర్శకుడు అనిల్ రావిపూడికి ఖరీదైన టొయోటా​ కారును బహుమతిగా అందించారు చిత్ర నిర్మాత సాహు గారపాటి. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన భగవంత్ కేసరి మూవీలో శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది. సీనియర్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ మరో కీలక పాత్రలో మెరిసింది. బాలీవుడ్ నటుడు అర్జున్‌ రాంపాల్‌ స్టైలిష్‌ విలన్‌గా నటించారు. అలాగే శరత్ కుమార్‌, రవి శంకర్‌, రఘు బాబు, శుభలేక సుధాకర్‌, జాన్‌ విజయ్‌, రాహుల్‌ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్‌. థమన్‌ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

టయోటా కారుతో డైరెక్టర్ అనిల్ రావి పూడి..

ఓటీటీలోనూ రికార్డులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నాని సినిమాలో ఛాన్స్ అలా మిస్సయ్యింది.. నాగ దుర్గ..
నాని సినిమాలో ఛాన్స్ అలా మిస్సయ్యింది.. నాగ దుర్గ..
23 ఏళ్ల తర్వాత శ్రీలంకపై టెస్ట్ సిరీస్ కొట్టిన వెస్టిండీస్
23 ఏళ్ల తర్వాత శ్రీలంకపై టెస్ట్ సిరీస్ కొట్టిన వెస్టిండీస్
ఫ్రెంచ్ అధికారి పేరుతో HYDలో పెద్ద ఏరియా! మూసారామ్‌బాగ్ చరిత్ర
ఫ్రెంచ్ అధికారి పేరుతో HYDలో పెద్ద ఏరియా! మూసారామ్‌బాగ్ చరిత్ర
పీఎఫ్ వడ్డీ మీకు వచ్చిందా..? లేదా..? ఇలా చెక్ చేస్కోండి..
పీఎఫ్ వడ్డీ మీకు వచ్చిందా..? లేదా..? ఇలా చెక్ చేస్కోండి..
అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్..
అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్..
ఆ హీరో సినిమాలో ఛాన్స్.. మూడు రోజుల్లో షూటింగ్ అని చెప్పి..
ఆ హీరో సినిమాలో ఛాన్స్.. మూడు రోజుల్లో షూటింగ్ అని చెప్పి..
కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..
కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..
రూ. 6నుండి రూ7లక్షల బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్, సేఫ్టీ ఇచ్చే కార్లు
రూ. 6నుండి రూ7లక్షల బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్, సేఫ్టీ ఇచ్చే కార్లు
మీ ఫొటోలతో మీకు తెలియకుండానే AI ఇమేజస్..!
మీ ఫొటోలతో మీకు తెలియకుండానే AI ఇమేజస్..!
రాత్రిళ్లు హఠాత్తుగా మేల్కొంటున్నారా? పీడకలలు, భయాలు వెంటాడుతు..
రాత్రిళ్లు హఠాత్తుగా మేల్కొంటున్నారా? పీడకలలు, భయాలు వెంటాడుతు..