Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1 అప్డేట్‌ వచ్చేసింది.. టీజర్‌తోనే భయపెట్టిన రిషబ్‌ శెట్టి.. వీడియో చూశారా?

కాంతారా2 సినిమాపై బిగ్ అప్డేట్‌ వచ్చేసింది. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఫస్ట్‌ లుక్‌తో పాటు మూవీ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. సోమవారం (నవంబర్ 27) ఉడిపి జిల్లా కుందాపూర్ తాలూకాలోని ఆనెగుడ్డె ఆలయంలో చిత్ర బృందం 'కాంతారా చాప్టర్ 1' చిత్రం మొదటి పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అలాగే టీజర్‌ను కూడా

Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1 అప్డేట్‌ వచ్చేసింది.. టీజర్‌తోనే భయపెట్టిన రిషబ్‌ శెట్టి.. వీడియో చూశారా?
Kantara Chapter 1 Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 27, 2023 | 1:20 PM

కాంతారా2 సినిమాపై బిగ్ అప్డేట్‌ వచ్చేసింది. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఫస్ట్‌ లుక్‌తో పాటు మూవీ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. సోమవారం (నవంబర్ 27) ఉడిపి జిల్లా కుందాపూర్ తాలూకాలోని ఆనెగుడ్డె ఆలయంలో చిత్ర బృందం ‘కాంతారా చాప్టర్ 1’ చిత్రం మొదటి పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అలాగే టీజర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు. కాగా కదంబ కాలం నాటి కథతో కాంతారా చాఫ్టర్‌ 1 సినిమా ఉంటుందని చిత్రబృందం టీజర్‌లో తెలిపింది. పోస్టర్స్‌ లో, టీజర్‌లో రిషబ్ శెట్టి లుక్‌ అదిరిపోయింది. తన ఇంటెన్స్‌ లుక్‌తో అందరినీ భయపెట్టాడీ ట్యాలెంటెడ్‌ హీరో అండ్‌ డైరెక్టర్‌. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఖడ్గంతో ఒక బావిలో నిలబడి కనిపించాడు రిషబ్‌ శెట్టి. ఇక కన్నడతో పాటు ఏడు భాషల్లో టీజర్ అందుబాటులో ఉంది. మీరు యూట్యూబ్‌లో మీకు నచ్చిన భాషలో టీజర్‌ను చూడవచ్చు. కాగా కాంతారా సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట కేవలం కన్నడలో భాషలోనే రిలీజైన ఈ సినిమా ఆ తర్వాత హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో డబ్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు కాంతారా ఛాప్టర్‌ 1 సినిమా కేవలం కన్నడలోనే కాకుండా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

ఈసారి  అంతకు మించి..

‘కాంతారా’ చిత్రాన్ని ‘హోంబాలే ఫిల్మ్స్’ బ్యానర్‌పై విజయ్ కిర్గందూర్ నిర్మించారు. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘కాంతారా 2’ని అంతకుమించి భారీ బడ్జెట్‌తో మరిన్ని అదనపు హంగులతో నిర్మించాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. రిషబ్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాంతారా 2 సినిమా షూటింగ్ ను వీలైనంత వేగంగా పూర్తి చేసి 2024 ఏప్రిల్‌ లేదా మేలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

కాంతారా ఛాప్టర్ 1 లో రిషబ్ శెట్టి లుక్..

కాంతారా ఛాప్టర్ 1 టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో