AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malla Reddy: రణ్‌బీర్‌ హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయిపో.. తెలుగోళ్లు చాలా తెలివైనవారు: మంత్రి మల్లా రెడ్డి

వచ్చే ఐదేళ్లలో బాలీవుడ్‌ తో పాటు హాలీవుడ్‌ను తెలుగోళ్లే శాసిస్తారని బీఆర్‌ఎస్‌ మంత్రి మల్లా రెడ్డి తెలిపారు. అలాగే బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కూడా హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయిపోవాలని మంత్రి సూచించారు . సోమవారం (నవంబర్‌ 27) మల్లారెడ్డి యూనివర్సిటీలో యానిమల్‌ మూవీ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ వేడుక ఘనంగా జరిగింది.

Malla Reddy: రణ్‌బీర్‌ హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయిపో.. తెలుగోళ్లు చాలా తెలివైనవారు: మంత్రి మల్లా రెడ్డి
Animal Movie Pre Release Event
Basha Shek
|

Updated on: Nov 28, 2023 | 12:40 PM

Share

వచ్చే ఐదేళ్లలో బాలీవుడ్‌ తో పాటు హాలీవుడ్‌ను తెలుగోళ్లే శాసిస్తారని బీఆర్‌ఎస్‌ మంత్రి మల్లా రెడ్డి తెలిపారు. అలాగే బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కూడా హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయిపోవాలని మంత్రి కోరారు. సోమవారం (నవంబర్‌ 27) మల్లారెడ్డి యూనివర్సిటీలో యానిమల్‌ మూవీ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ వేడుక ఘనంగా జరిగింది. బాలీవుడ్ హీరో రణ్‌ బీర్‌ కపూర్‌, హీరోయిన్‌ రష్మిక మందన్నాతో పాటు టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ఈ వేడుకలో సందడి చేశారు. ఇక మంత్రి మల్లారెడ్డి కూడా యానిమల్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఎప్పటిలాగే తన అగ్రెసివ్‌ స్పీచ్‌తో ఆహూతులను అలరించారు. ‘మహేశ్‌ గారు.. నేను మీ బిజినెస్‌మెన్‌ సినిమాను చూసే రాజకీయాల్లోకి వచ్చాను. పదిసార్లు ఆ సినిమా చూశాను. ఎంపీనయ్యాను. సేమ్‌ మోడల్‌.. సేమ్‌ సిస్టమ్‌.. అంతా సేమ్‌ టు సేమ్‌. రణ్‌బీర్‌.. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. మరో ఐదేళ్లలో తెలుగు ఇండస్ట్రీ బాలీవుడ్‌, హాలీవుడ్‌ అంతటినీ ఏలుతుంది. త్వరగా మీరు కూడా హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయిపోండి. ముంబై బాగా పాతదైపోయింది. బెంగళూరులో ట్రాఫిక్‌ జామ్‌ ఎక్కువగా ఉంది. ఇప్పుడు భారతదేశంలో అనుకూలంగా ఉన్న ఏకైక నగరం మన హైదరాబాద్ నగరమే’ అంటూ చెప్పుకొచ్చారు మల్లారెడ్డి.

యానిమల్ రూ.500 కోట్లు రాబడుతుంది..

ఇదే వేదికగా యానిమల్ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా, దిల్ రాజు రష్మిక మందన్నాలపై ప్రశంసలు కురిపించారు మల్లా రెడ్డి.  ‘తెలుగోళ్లు చాలా తెలివైనవారు. రాజమౌళి, దిల్‌ రాజు, సందీప్‌ రెడ్డి వంగా, రష్మిక మందన్నా.. వీరంతా  ఎంతో తెలివైనవారు. పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మీ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగువారి అశ్వమేధ యాగం జరుగుతుంది.   మీ యానిమల్‌ సినిమా కూడా రూ.500 కోట్ల కలెక్షన్లు రాబడుతుంది’ అని చెప్పుకొచ్చారు మల్లా రెడ్డి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

రణ్  బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇందులో అనిల్ కపూర్ రణ్ బీర్ తండ్రిగా నటిస్తున్నాడు. అలాగే మరో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు.  హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరాలు సమకూర్చాడు.

ఇవి కూడా చదవండి

‘యానిమల్’ ఈవెంట్ లో  మంత్రి మల్లా రెడ్డి స్పీచ్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
రవితేజ ఖాతాలో హిట్ పడిందా? లేదా ? ఇరుముడి రివ్యూ
రవితేజ ఖాతాలో హిట్ పడిందా? లేదా ? ఇరుముడి రివ్యూ
ఈ స్టార్ కమెడియన్ కొడుకు ఇప్పుడు ప్రముఖ స్వామిజీ అని తెలుసా?
ఈ స్టార్ కమెడియన్ కొడుకు ఇప్పుడు ప్రముఖ స్వామిజీ అని తెలుసా?
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా