Virat Kohli: ముఖానికి గాయాలు.. ముక్కుపై బ్యాండేజ్‌.. విరాట్‌ కోహ్లీకి ఏమైంది? కంగారు పడుతోన్న ఫ్యాన్స్‌

టీమిండియా మాజీ కెప్టెన్, రన్‌ మెషిన్‌ విరాట్ కోహ్లి లేటెస్ట్ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన అతని అభిమానులు షాక్ అవుతున్నారు. ఇందులో వైట్‌ టీషర్ట్‌తో కనిపించిన కోహ్లీ ముఖంపై గాయాలున్నాయి. ముక్కుకు బ్యాండేజ్‌ ఉంది. నుదురు, చెంపలపై మచ్చలు ఉన్నాయి. ఎడ‌మ క‌న్ను న‌ల్లగా క‌మిలిపోయి ఉంది. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ‘విరాట్ కోహ్లీకి ఏమైంది..’ అని కంగారుప‌డుతున్నారు.

Virat Kohli: ముఖానికి గాయాలు.. ముక్కుపై బ్యాండేజ్‌.. విరాట్‌ కోహ్లీకి ఏమైంది? కంగారు పడుతోన్న ఫ్యాన్స్‌
Virat Kohli
Follow us
Basha Shek

|

Updated on: Nov 28, 2023 | 1:36 PM

టీమిండియా మాజీ కెప్టెన్, రన్‌ మెషిన్‌ విరాట్ కోహ్లి లేటెస్ట్ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన అతని అభిమానులు షాక్ అవుతున్నారు. ఇందులో వైట్‌ టీషర్ట్‌తో కనిపించిన కోహ్లీ ముఖంపై గాయాలున్నాయి. ముక్కుకు బ్యాండేజ్‌ ఉంది. నుదురు, చెంపలపై మచ్చలు ఉన్నాయి. ఎడ‌మ క‌న్ను న‌ల్లగా క‌మిలిపోయి ఉంది. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ‘విరాట్ కోహ్లీకి ఏమైంది..’ అని కంగారుప‌డ్డారు. క్షణాల్లోనే ఈ ఫొటో సోష‌ల్‌ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే.. ఆ ఫొటోకు ర‌న్ మెషీన్ ‘మీరు మ‌రొక వ్యక్తిని చూస్తారు’ అని క్యాప్షన్ రాశాడు. అంతేకాదు ఆ ఫొటోలో కోహ్లీ న‌వ్వుతూ విజ‌య సంకేతం చూపించాడు. దీంతో ఇందులో ఏదో మతలబు ఉందనుకున్నారు ఫ్యాన్స్‌. చివరకు అదే నిజమైంది. కోహ్లీకి ఎలాంటి గాయాలు కాలేదు. పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. ఇది కేవలం మేకప్ మాత్రమే. ఓ ప్రతిష్టాత్మక కంపెనీ ప్రకటన కోసం కోహ్లీ ఈ ఫొటోను పోస్ట్ చేశాడు. ఇది ప్రమోషన్ కోసం మాత్రమే. నుదుటిపైన, చెంపపైన గాయం ఉన్నా, ముక్కుకు బ్యాండేజ్ ఉన్నప్పటికీ కోహ్లీ ఈ ఫోటోలో నవ్వుతూ ఉన్నాడు. ఈ ఫోటోను పోస్ట్ చేయాలనే ఉద్దేశ్యం గురించి కూడా కోహ్లీ రాశాడు. కోహ్లీకి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌ నుంచి విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును ప్రపంచకప్‌లో కోహ్లీ బద్దలు కొట్టాడు. ప్రపంచ కప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా అందుకున్నాడు. ప్రపంచకప్‌ లో టోర్నీలో 11 మ్యాచ్‌ల్లో 95.62 సగటుతో 765 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక రాబోయే ఐపీఎల్‌ సీజన్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఆర్‌సీబీకి తప్పితే మరే జట్టుకు ఆడలేదు కోహ్లీ. ఈ ఘనత అందుకున్న ఏకైక ప్లేయర్‌ కూడా కోహ్లీనే కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

గాయాలతో విరాట్ కోహ్లీ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..