IPL 2024: కోహ్లీ మాజీ టీమ్‌మేట్ మళ్లీ సొంత గూటికే.! ప్రపంచకప్ విన్నర్‌కు వేలంలో జాక్‌పాటే..
క్రికెట్ ఫ్యాన్స్ ఫోకస్ అంతా కూడా ఐపీఎల్ 2024 వేలం వైపునకు షిఫ్ట్ అయింది. ఈ వేలంలో ప్రపంచకప్ హీరోలపై కన్నేశాయి ఫ్రాంచైజీలు. దుబాయ్ వేదికగా జరిగే ఈ ఆక్షన్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర, ఆసీస్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ కోసం ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది.
క్రికెట్ ఫ్యాన్స్ ఫోకస్ అంతా కూడా ఐపీఎల్ 2024 వేలం వైపునకు షిఫ్ట్ అయింది. ఈ వేలంలో ప్రపంచకప్ హీరోలపై కన్నేశాయి ఫ్రాంచైజీలు. దుబాయ్ వేదికగా జరిగే ఈ ఆక్షన్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర, ఆసీస్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ కోసం ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్‌లో లేట్ ఎంట్రీ ఇచ్చిన ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్.. ఫైనల్‌లో భారత్‌పై అదిరిపోయే సెంచరీ(137) సాధించి తన జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్ అతడ్ని ఐపీఎల్ 2024 వేలంలో మోస్ట్ వాంటెడ్ బ్యాట్స్‌మెన్‌ను చేసింది.
ఇక రిటెన్షన్ జాబితా విడుదల అనంతరం.. ఫ్రాంచైజీల వద్ద మిగులు బడ్జెట్‌ను పరిశీలిస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ మాజీ ఆటగాడు ట్రావిస్ హెడ్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోందని సమాచారం. ఆర్సీబీకి ప్రస్తుతం పర్స్‌లో రూ. 23.25 కోట్లు ఉన్నాయి. ఆ జట్టు కావాల్సింది ఓవర్సీస్ పేసర్, ఆల్‌రౌండర్, ఇండియన్ పేసర్.. ఈ తరుణంలో ఆల్‌రౌండర్ ఖాతాలో ట్రావిస్ హెడ్‌ను తీసుకోవాలని చూస్తోందట.
ట్రావిస్ హెడ్.. గతంలోనే కోహ్లీ టీం తరపున ఆడాడు. 2016-17 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు ట్రావిస్ హెడ్. ఆ సమయంలో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 1 అర్ధ సెంచరీతో 205 పరుగులు చేశాడు. ఇందులో హెడ్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 75. కాబట్టే.. తన మాజీ టీంమేట్‌ను తిరిగి గూటిలోకి చేర్చుకోవాలని చూస్తోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ. వేలంలో హెడ్ ఏమేరకు అమ్ముడుపోతాడో మరి చూడాలి.!
Presenting RCB’s #ClassOf2024 – RETAINED PLAYERS LIST
Faf du Plessis Virat Kohli Glenn Maxwell Mohammed Siraj Dinesh Karthik Rajat Patidar Reece Topley Will Jacks Suyash Prabhudessai Anuj Rawat Mahipal Lomror Manoj Bhandage Karn Sharma Mayank Dagar Vyshak Vijaykumar… pic.twitter.com/kO5F3g9IPK
— Royal Challengers Bangalore (@RCBTweets) November 26, 2023
Go Green! 💚
We can’t wait for our new Caped Crusader to represent us in the 𝑹𝒆𝒅 𝒂𝒏𝒅 𝑮𝒐𝒍𝒅. 🦸♂️#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 @CameronGreen_ pic.twitter.com/axvXcpVFL0
— Royal Challengers Bangalore (@RCBTweets) November 28, 2023
రిటెన్షన్ జాబితా ఇదే..
ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ డాగర్ (ఎస్‌ఆర్‌హెచ్ నుంచి), విజయ్‌కుమార్ వైషాక్, ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్ (ముంబై ఇండియన్స్ నుంచి)
ఆర్సీబీ రిలీజ్ చేసిన ఆటగాళ్లు..
వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్.