IND vs AUS: సూర్య కుమార్‌ను ఊరిస్తోన్న అరుదైన రికార్డు.. మరో 60 రన్స్ చేస్తే కోహ్లీ రికార్డు బద్దలు
ఈరోజు జరిగే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 60 పరుగులు చేస్తే.. సరికొత్త రికార్డు క్రియేట్ అవుతుంది. దిగ్గజాల జాబితాలో సూర్యకుమార్ పేరు చేరనుంది, ఇప్పటి వరకు ముగ్గురు భారత క్రికెటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఈరోజు జరిగే మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 60 పరుగులు చేస్తే, అంతర్జాతీయ టీ20ల్లో 2000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో చేరతాడు
ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ 2-0 ఆధిక్యంతో ప్రస్తుతం మూడో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. మంగళవారం (నవంబర్ 28) గౌహతిలోని బుర్సపరా క్రికెట్ స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 60 పరుగులు చేస్తే.. సరికొత్త రికార్డు క్రియేట్ అవుతుంది. దిగ్గజాల జాబితాలో సూర్యకుమార్ పేరు చేరనుంది, ఇప్పటి వరకు ముగ్గురు భారత క్రికెటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఈరోజు జరిగే మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 60 పరుగులు చేస్తే, అంతర్జాతీయ టీ20ల్లో 2000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో చేరతాడు . పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో 52 మ్యాచ్‌లు ఆడిన సూర్య 3 సెంచరీలు, 16 అర్ధసెంచరీలతో సహా మొత్తం 1940 పరుగులు చేశాడు. ఒకవేళ సూర్యకుమార్ ఆస్ట్రేలియాపై గౌహతిలో లేదా తదుపరి రెండు T20 ఇంటర్నేషనల్స్‌లో 60 పరుగులు 2000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన నాల్గవ భారత బ్యాటర్ అవుతాడు. అతని కంటే ముందు ముగ్గురు వ్యక్తులు ఈ ఘనత సాధించారు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మాత్రమే ఉన్నారు. కోహ్లీ 115 టీ20ల్లో 1 సెంచరీ, 37 అర్ధసెంచరీలతో 4008 పరుగులు చేశాడు.
ఇక రోహిత్ శర్మ 148 మ్యాచ్‌ల్లో 3853 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 72 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 2265 పరుగులతో కేఎల్ రాహుల్ ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 2000 పరుగుల మార్క్ చేరుకోవడానికి కోహ్లీ 56 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఇక సూర్యకుమార్ 52 ఇన్నింగ్స్‌ల్లోనే 1940 పరుగులు చేశాడు. ఒకవేళ ఈ మూడు మ్యాచ్‌ల్లోపు 60 పరుగులు పూర్తి చేస్తే టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన భారతీయుడిగా రికార్డులకెక్కుతాడు సూర్య. ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన విషయానికొస్తే.. అతను ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో 190.38 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 99 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది.
టీమ్ ఇండియా ప్లేయింగ్-11 (అంచనా): సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.
గౌహతిలో టీమిండియా క్రికెటర్లు..
✈️ Next stop ➡️ Guwahati 👌👌#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/DdwbksHZlj
— BCCI (@BCCI) November 27, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..