IND vs AUS: హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన టీమిండియా.. నేడు ఆసీస్‌తో మూడో టీ20.. తిలక్‌ వర్మకు ఆఖరి ఛాన్స్‌

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లోనూ విజయం సాధించి 2-0 ఆధిక్యంలో నిలిచిన టీమిండియా ఇప్పుడు మూడో మ్యాచ్‌కు సిద్ధమైంది. మంగళవారం (నవంబర్ 28) గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉండటంతో, ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సూర్య సేన సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది

IND vs AUS: హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన టీమిండియా.. నేడు ఆసీస్‌తో మూడో టీ20.. తిలక్‌ వర్మకు ఆఖరి ఛాన్స్‌
India Vs Australia
Follow us
Basha Shek

|

Updated on: Nov 28, 2023 | 6:43 AM

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లోనూ విజయం సాధించి 2-0 ఆధిక్యంలో నిలిచిన టీమిండియా ఇప్పుడు మూడో మ్యాచ్‌కు సిద్ధమైంది. మంగళవారం (నవంబర్ 28) గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉండటంతో, ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సూర్య సేన సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఇందుకోసం మంగళవారం జరిగే మ్యాచ్‌ కోసం టీమిండియా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే మూడో టీ20 జరుగుతోందా.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందా? అని అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. అయితే వెదర్ ఛానల్ తాజా అప్‌డేట్ ప్రకారం, నవంబర్ 28న గౌహతిలో వర్ష సూచన లేదు. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్నందున గరిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది. మ్యాచ్ ముగిసే సమయానికి ఇది క్రమంగా 19 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోతుంది. కాబట్టి మ్యాచ్ రోజు వర్షం కురిసే అవకాశం లేదు. రోజంతా, తేమ దాదాపు 67% ఉంటుందని అంచనా. దీంతో భారత్-ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్ ఎలాంటి అవాంతరాలు లేకుండా జరగనుంది. ఇక బుర్సపరా క్రికెట్ స్టేడియంలోని పిచ్ చాలా నెమ్మదిగా ఉంది. అయితే ఇటీవలి రికార్డులు బ్యాటింగ్‌కు అనుకూలమని చెప్పవచ్చు. బౌలర్లకు పెద్దగా అనుకూలించదు. ఈ వేదికపై జరిగిన మూడు టీ20ల్లో సగటు స్కోరు 118 కావడం గమనార్హం.

మార్పుల్లేకుండానే బరిలోకి..

ఇక ముందుగా బ్యాటింగ్ చేసి ఛేజింగ్ చేసిన జట్ల గెలుపు-ఓటముల రికార్డు 1-1తో సమమైంది. ఆట ప్రారంభమైన తర్వాత మంచు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడమే బెస్ట్ ఆప్షన్ అంటున్నారు పిచ్‌ నిపుణులు. కాగా ఈ సిరీస్‌లో భారత్‌ బ్యాటింగ్‌ అద్భుతంగా ఉంది. గత మ్యాచ్‌లో ఇద్దరు ఓపెనింగ్ బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. యశస్వి జైస్వాల్ 53 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 58 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ 52 రన్స్‌ చేశాడు. అలాగే రెండు మ్యాచుల్లోనూ రింకూ సింగ్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. కాగా ఈ సిరీస్‌లో తిలక్ వర్మ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి తిలక్ వర్మ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. తొలి టీ20 మ్యాచ్‌లో పది బంతుల్లో 12 పరుగులు చేసి అవుటయ్యాడు. 209 పరుగుల లక్ష్యఛేదనలో తిలక్ వర్మ 12 రన్స్ మాత్రమే చేసి నిరాశపరిచాడు. వన్డే ప్రపంచకప్‌లో ఆడిన శ్రేయస్‌ అయ్యర్‌ ఆఖరి రెండు టీ20లకు జట్టులో చేరనున్నాడు. కాబట్టి అయ్యర్ జట్టుతో చేరితే తిలక్ వర్మ స్థానానికి ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

టీమ్ ఇండియా ప్లేయింగ్-11 (అంచనా): సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?