AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: టీమిండియాకు ఊరట.. స్వదేశానికి వెళ్లిపోయిన మ్యాక్స్‌వెల్‌ .. కారణమిదే

టీమ్‌ ఇండియాతో జరుగుతోన్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా అద్భుతంగా పునరాగమనం చేసింది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. అయితే మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కాబట్టి సిరీస్‌లో నాలుగో మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది

IND vs AUS: టీమిండియాకు ఊరట.. స్వదేశానికి వెళ్లిపోయిన మ్యాక్స్‌వెల్‌ .. కారణమిదే
Australia Cricket Team
Basha Shek
|

Updated on: Nov 29, 2023 | 9:46 PM

Share

టీమ్‌ ఇండియాతో జరుగుతోన్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా అద్భుతంగా పునరాగమనం చేసింది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. అయితే మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కాబట్టి సిరీస్‌లో నాలుగో మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. సిరీస్‌లో నిలవాలంటే ఆస్ట్రేలియా నాల్గవ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి. అదే సమయంలో ఈ మ్యాచ్ గెలిస్తే టీమ్ ఇండియా సిరీస్ కైవసం చేసుకుంటుంది.  రాయ్‌పూర్‌ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. శుక్రవారం (డిసెంబర్‌ 1)న షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మైదానంలో ఇది తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కాగా ఇంతకు ముందు ఈ మైదానంలో ఒకే వన్డే మ్యాచ్ జరిగింది. ఇందులో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో భారత జట్టుపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు జట్లకు నాలుగో టీ20 మ్యాచ్‌ నిర్ణయాత్మకంగా మారింది.

స్వదేశానికి వెళ్లి పోయిన మ్యాక్సీ, స్టొయినిస్‌

కాగా మూడో టీ 20 మ్యాచ్‌లో భారీ సెంచరీతో ఆస్ట్రేలియాను ఒంటి చేత్తో గెలిపించిన పించ్‌ హిట్టర్‌ గ్లెయిన్‌ మ్యాక్స్‌ వెల్‌ స్వదేశానికి వెళ్లిపోయాడు. భారత్‌తో జరిగే మిగతా రెండు టీ20 మ్యాచ్‌లకు టీమ్ మేనేజ్‌మెంట్ మ్యాక్సీకి రెస్ట్‌ ఇచ్చింది. దీంతో అతను స్వదేశానికి వెళ్లిపోయాడు. మ్యాక్సీతో పాటు స్టీవ్‌ స్మిత్‌, ఆడమ్ జంపా, జోస్ ఇంగ్లిస్‌, సీన్‌ అబాట్‌, మార్కస్‌ స్టొయినిస్‌ కూడా స్వదేశానికి వెళ్లిపోయారు.

భారత జట్టు:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, యస్సవి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింఘోయ్, పర్దీష్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియా జట్టు:

మాథ్యూ వేడ్ (కెప్టెన్), జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, జోష్ ఫిలిప్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, కేన్ రిచర్డ్‌సన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!