IND Vs SA: కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఉండాల్సిందే.. దక్షిణాఫ్రికా టూర్‌లో హిట్‌ మ్యానే కీలకం.. ఎందుకంటే?

దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 10 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది, దీనికి గురువారం (నవంబర్‌ 30) జట్టును ప్రకటించవచ్చు. అయితే, ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మూడు ఫార్మాట్‌లకు అందుబాటులో ఉంటాడా లేదా అనే సందేహం ఇంకా మిగిలి ఉంది. విరాట్ కోహ్లీ ఇప్పటికే వైట్ బాల్ ఫార్మాట్‌కు దూరమయ్యాడు.

IND Vs SA: కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఉండాల్సిందే.. దక్షిణాఫ్రికా టూర్‌లో హిట్‌ మ్యానే కీలకం.. ఎందుకంటే?
Team India
Follow us
Basha Shek

|

Updated on: Nov 30, 2023 | 7:29 AM

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసినా ఫైనల్‌లో దురదృష్టం వెక్కిరించింది. ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు పరాజయం పాలైంది. ప్రపంచకప్‌ తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ ఉన్నప్పటికీ.. దక్షిణాఫ్రికా పర్యటనతోనే టీమిండియాకు అసలైన పరీక్ష ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 10 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది, దీనికి గురువారం (నవంబర్‌ 30) జట్టును ప్రకటించవచ్చు. అయితే, ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మూడు ఫార్మాట్‌లకు అందుబాటులో ఉంటాడా లేదా అనే సందేహం ఇంకా మిగిలి ఉంది. విరాట్ కోహ్లీ ఇప్పటికే వైట్ బాల్ ఫార్మాట్‌కు దూరమయ్యాడు. కాబట్టి రోహిత్ శర్మ ఇక్కడ అందుబాటులో ఉండాలని అందరూ భావిస్తున్నారు. ఇక సౌతాఫ్రికా టూర్ గురించి మాట్లాడుకుంటే టీమ్ ఇండియా ఇక్కడ 3 టీ20, 3 వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మొత్తం జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రపంచ కప్ తర్వాత, సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారని, మిగిలిన జట్టు ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడుతున్నారని మీకు తెలియజేద్దాం. దక్షిణాఫ్రికా పర్యటన ముఖ్యమైనది. పైగా చాలా కీలకం. కాబట్టి టీమ్ ఇండియా బలమైన టీమ్‌ను పంపాలని భావిస్తోంది. ఇక ఈ టూర్‌లో టెస్టు సిరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉంటానని విరాట్ కోహ్లీ ఇప్పటికే సూచించినందున, మరికొందరు ఆటగాళ్లకు అవకాశం లభించే అవకాశం ఉంది.

వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓటమితో రోహిత్ శర్మ పూర్తిగా సైలెంట్‌ అయిపోయాడు. ఫైనల్ తర్వాత అతను ఎక్కడా కనిపించలేదు. ఆసీస్‌ చేతిలో ఓటమి తర్వాత ఏడుస్తూ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిన దృశ్యం అందరికీ గుర్తుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికా టూర్‌ నుంచి కొత్త ఛాలెంజ్‌ మొదలుకానుంది. కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాడు ఇక్కడ లేనందున, రోహిత్ అందుబాటులో ఉండాలని బోర్డు కోరుకుంటుంది. జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు రోహిత్‌ అందుబాటులో ఉంటే ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. అయితే టీ20 ప్రపంచ కప్ 2022 సెమీ-ఫైనల్‌లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌లో మ్యాచ్ లు ఆడలేదు. రోహిత్‌ దక్షిణాఫ్రికా సిరీస్‌కు అందుబాటులో ఉంటే ఐపీఎల్‌తో పాటు టీ 20 ప్రపంచ కప్‌కు కూడా సిద్ధం కావచ్చు.

దక్షిణాఫ్రికాలో రోహిత్ శర్మ రికార్డులు..

  • 6 టీ20లు- 135 పరుగులు
  • 14 వన్డేలు- 256 పరుగులు, 1 సెంచరీ
  • 4 టెస్టులు- 123 పరుగులు

దక్షిణాఫ్రికాలో భారత్‌ పర్యటన వివరాలివే..

  • తొలి టీ20: డిసెంబర్ 10
  • రెండో టీ20: డిసెంబర్ 12
  • మూడో టీ20: డిసెంబర్ 14
  • మొదటి వన్డే: 17 డిసెంబర్
  • రెండో వన్డే: డిసెంబర్ 19
  • మూడో వన్డే: డిసెంబర్ 21
  • మొదటి టెస్ట్: డిసెంబర్ 26-30
  • రెండో టెస్టు: జనవరి 3-7
ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?