Keedaa Cola OTT: ఓటీటీలోకి తరుణ్‌ భాస్కర్‌ ‘కీడా కోలా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

న‌వంబ‌ర్ 3న థియేట‌ర్ల‌లో రిలీజైన కీడా కోలా యావరేజ్‌గా నిలిచింది. తరుణ్‌ భాస్కర్‌ మార్క్‌ కామెడీ ఉన్నా సినిమా కాన్సెప్ట్‌ జనాలకు పెద్దగా కనెక్ట్‌ కాలేకపోయింది. అయితే ఈ సినిమా సీన్స్‌ నెట్టంట మీమ్స్‌గా బాగా వైరలయ్యాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన కీడా కోలా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్ కు రానుంది.

Keedaa Cola OTT: ఓటీటీలోకి తరుణ్‌ భాస్కర్‌ 'కీడా కోలా'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Keedaa Cola Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 29, 2023 | 6:47 PM

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌ తర్వాత తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన సినిమా కీడా కోలా. క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు దగ్గుబాటి రానా సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. తరుణ్‌ భాస్కర్‌తో పాటు చైతన్య రావు, మయూర్ రాగ్, జీవన్, బ్రహ్మానందం, జీవన్, రఘురామ్, విష్ణు, రవీంద్ర విజయ్‌ తదితరులు ఈ సినిమాలో నటించారు. న‌వంబ‌ర్ 3న థియేట‌ర్ల‌లో రిలీజైన కీడా కోలా యావరేజ్‌గా నిలిచింది. తరుణ్‌ భాస్కర్‌ మార్క్‌ కామెడీ ఉన్నా సినిమా కాన్సెప్ట్‌ జనాలకు పెద్దగా కనెక్ట్‌ కాలేకపోయింది. అయితే ఈ సినిమా సీన్స్‌ నెట్టంట మీమ్స్‌గా బాగా వైరలయ్యాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన కీడా కోలా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహా తరుణ్‌ భాస్కర్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 8 నుంచి కీడా కోలా మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

వీజీ సైన్మా ప్రొడక్షన్ బ్యానర్‌పై కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ కీడా కోలా సినిమాను నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఏజే ఆరోన్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించగా, ఉపేంద్ర వర్మ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఇక కీడా కోలా క‌థ విషయానికి వస్తే..వాస్తు (చైత‌న్య‌రావు) కు క‌ష్టాల నుంచి బయటపడడానికి చాలా డ‌బ్బు అవ‌స‌రం అవుతుంది. అదే సమయంలో తాత వ‌ర‌ద‌రాజు (బ్ర‌హ్మానందం) కోసం వాస్తు కొన్న కూల్‌డ్రింక్‌లో బొద్దింక వ‌స్తుంది. వినియోగ‌దారులు ఫోరంలో కేసు వేస్తాన‌ని కూల్‌డ్రింక్ సంస్థ య‌జ‌మానిని బెదిరించి డ‌బ్బు లాక్కోవాల‌ని వాస్తు ప్రణాళికలు వేస్తాడు. ఇందుకు అతని స్నేహితుడు లాయ‌ర్ లంచం (రాగ్ మ‌యూర్‌) స‌హ‌క‌రిస్తాడు. అయితే నాయుడు (త‌రుణ్ భాస్క‌ర్‌) అనే రౌడీ ఎంట్రీతో వాస్తు ప్లాన్‌ తలకిందులవుతోంది. చివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కీడా కోలా సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

విజయ్ దేవర కొండతో తరుణ్ భాస్కర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే