Brahmamudi, December 1st episode: కావ్య పెళ్లి పెటాకులు చేస్తానన్న రాహుల్.. రాజ్ అక్రమ సంబంధాన్ని బయట పెట్టిన కావ్య!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో తన అక్కని కాపాడు కోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కావ్య. ఇంట్లో రుద్రాణి మొదలు పెట్టిన రచ్చ కొనసాగుతూ ఉంటుంది. స్వప్నపై అనవసరంగా రాహుల్, రుద్రాణిలు నోరు పారేసుకుంటా. కావ్య అడ్డుకుని ఇది 'అగ్ని పరీక్ష కాదనగలరా? ఒక స్త్రీ తప్పు చేయలేదని పరీక్షించి కానీ తెలుసుకోలేరా' అని కావ్య అంటుంది. నువ్వు అన్నది నిజమేనమ్మా.. సీతమ్మ తల్లికే నింద తప్పలేదు.. లోకం వేసే నిందలకు భరించలేక.. తన భార్య గురించి తెలిసి కూడా రామయ్య సీతమ్మకి అగ్ని పరీక్ష పెట్టాడు అంటాడు సీతా రామయ్య. ఎక్కడ ఉంది ఆ లోకం..

Brahmamudi, December 1st episode: కావ్య పెళ్లి పెటాకులు చేస్తానన్న రాహుల్.. రాజ్ అక్రమ సంబంధాన్ని బయట పెట్టిన కావ్య!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Dec 01, 2023 | 11:52 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో తన అక్కని కాపాడు కోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కావ్య. ఇంట్లో రుద్రాణి మొదలు పెట్టిన రచ్చ కొనసాగుతూ ఉంటుంది. స్వప్నపై అనవసరంగా రాహుల్, రుద్రాణిలు నోరు పారేసుకుంటా. కావ్య అడ్డుకుని ఇది ‘అగ్ని పరీక్ష కాదనగలరా? ఒక స్త్రీ తప్పు చేయలేదని పరీక్షించి కానీ తెలుసుకోలేరా’ అని కావ్య అంటుంది. నువ్వు అన్నది నిజమేనమ్మా.. సీతమ్మ తల్లికే నింద తప్పలేదు.. లోకం వేసే నిందలకు భరించలేక.. తన భార్య గురించి తెలిసి కూడా రామయ్య సీతమ్మకి అగ్ని పరీక్ష పెట్టాడు అంటాడు సీతా రామయ్య. ఎక్కడ ఉంది ఆ లోకం.. ఇద్దరి తల్లీ కొడుకుల్లోనే ఉందని కావ్య అంటే.. అవును నువ్వు చెప్పింది కరెక్టే.. నేను కూడా డీఎన్ఏ టెస్ట్ కి అంగీకరిస్తున్నా.. మీ అక్కనే తేల్చుకోమను.. లేదంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లమను అని అంటుంది రుద్రాణి. మా చెల్లి సంగతి వదిలి పెట్టండి అత్తయ్యా.. నేను మొదటి నుంచి కూడా డీఎన్ఏ టెస్ట్ కి రెడీ అనే కదా అంటున్నా అంటుంది స్వప్న.

స్వప్న – రుద్రాణిల ఛాలెంజ్..

స్వప్న మాటలకు రుద్రాణి కూడా.. సరే.. డీఎన్ఏ పరీక్షలో నువ్వు గెలిస్తే కోడలిగా నేను అంగీకరిస్తా.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటా.. నా కొడుక్కి విక్ష వేస్తా. మరి నీ కడుపులో బిడ్డ ఈ ఇంటి వారసుడు కాదని తెలిస్తే నువ్వేం చేస్తావ్? అని రుద్రాణి.. స్వప్నని అడుగుతుంది. నేను రెడీ.. నా కడుపులో బిడ్డ మీ ఇంటి రక్తమేనని తేలక పోతే.. మీ కొడుక్కి విడాకులు ఇచ్చి ఈ ఇంటి నుంచి వెళ్లి పోతా అని అంటుంది స్వప్న నమ్మకంగా.

ఇందిరా దేవిని ప్రశ్నించిన కావ్య.. తప్పడం లేదన్న పెద్దావిడ:

ఇది చూసిన కావ్య.. ఆపండి ఏంటి? మీ ఒప్పందాలు అని అరుస్తుంది గట్టిగా.. అమ్మమ్మ గారూ సాటి స్త్రీగా, ఈ ఇంటి పెద్దగా.. వీళ్ల షరతులు వింటూ ఎందుకు అలా మౌనంగా ఉంటారేంటి అమ్మమ్మా.. నిస్సహాయంగా చూస్తారేంటి? అని పెద్దావిడని అడుగుతుంది కావ్య. తప్పడం లేదు కావ్య.. అంగట్లో వస్తువులు వేలం వేసినట్లు ఈ లోగిట్లో ఓ ఆడ పిల్ల పవిత్రతను వేలం వేస్తుంటే.. ప్రేక్షకులతో పాటు మేమూ చేరి పోవాల్సి వచ్చింది. నీ బాధా.. మా బాధా ఒక్కటే. కానీ ఈ బేరసారాలను మౌనంగా చూడటం తప్పడం లేదు. ఒక ఆడదానిలా ఇది అర్థం చేసుకోగలను. ఇది మోయలేని ఆరోపణ. కానీ స్వప్న మోస్తానంటోంది.. నిజం తేలేదాకా ఈ నిందను భరిస్తానంటుంది. తన పవిత్రతను రుజువు చేసుకోవడానికి ఇంత కన్నా దారి లేనప్పుడు.. ఆ దారినే వెళ్ల నిద్దాం. స్వప్నని వెనక్కి లాగాలని ఉన్నా.. జరగబోయే మంచి కోసం నేను కూడా మౌనంగా ఉన్నా. ఈ పరీక్షకు ఒప్పుకుందాం కావ్యా.. అని ఇందిరా దేవి అంటుంది.

ఇవి కూడా చదవండి

రుద్రాణి ప్లాన్.. దొరికి పోతామంటున్న రాహుల్..

నాన్నమ్మ కూడా ఒప్పుకున్నాక.. ఇంక ఎవరూ ఒప్పుకోవడానికి వీల్లేదు. ఇంకా నెల రోజులు టైం ఉంది కాబట్టి.. అప్పటి వరకూ ఎలాంటి గొడవలు జరగడానికి వీల్లేదు. ఈ గొడవల వల్ల తాతయ్య మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఇది గుర్తు పెట్టోండి అంటాడు రాజ్. డీల్ ఓకే.. స్వప్నని గెంటేసే రోజు కోసం.. ఒక నెల రోజులు వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి రుద్రాణి వెళ్లి పోతుంది. ఇక రుద్రాణి, రాహుల్ లు తమ గదికి వెళ్తారు. మామ్ ఎందుకు అలా ఒప్పుకున్నావ్? అని రాహుల్ అంటే నాకు మరో దారి కనిపించలేదని రుద్రాణి అంటుంది. కన్న కొడుకుని అని చూడకుండా నన్నే బలి పశువును చేస్తావా.. ఆ కావ్యకి మంచి అవకాశం ఇచ్చావు. ఆ స్వప్నని నా నెత్తిన పెట్టేంతవరకూ ఊరుకోదు. అసలే అది పగ పట్టిన పాములా నేను ఎప్పుడెప్పుడు దొరుకుతానా అని చూస్తుందని రాహుల్ అంటే.. నువ్వు ఇలా ఆవేశ పడబట్టే ఎప్పుడూ మన ప్లాన్ ఫెయిల్ అవుతుంది. సరిగ్గా ఆలోచిస్తే నేను ఎందుకు దీనికి ఒప్పుకున్నానో నీకే అర్థం అవుతుందని రుద్రాణి అంటే.. నీ ఆవేశాన్ని వాడుకుని అది ఇక్కడ సెటిల్ అవ్వడానికి చూస్తోందని రాహుల్ అంటాడు.

స్వప్నని కావ్య కాపాడలేదు: రుద్రాణి:

ఇప్పుడు ఆ కావ్య మాటలకి నేను ఒప్పుకోకపోయి ఉంటే.. ఆడ పిల్లను అనుమానించ కూడదన్న సాకుతో దాన్ని ఇంట్లోనే ఉండమని చెప్పేవాళ్లు అని రుద్రాణి అంటుంది. ఆ కావ్య ఎంత డేంజరో నీకు తెలుసు కదా.. ఆ అరుణ్ ని వెతుక్కుంటూ ఆస్పత్రి వరకూ వెళ్లింది.. నేను ముందే వెళ్లాను కాబట్టి సరిపోయింది. లేదంటే దొరికిపోయే వాళ్లమని రాహుల్ అంటాడు. ఆ కావ్య ఆలోచనలు, ప్లాన్స్ అన్నీ నేను ముందే పసిగట్టగలను. అది ఎంత ప్రయత్నించినా స్వప్నని కాపాడ లేదని రుద్రాణి అంటే.. నాకు ఆ నమ్మకం లేదని రాహుల్ అంటాడు.

దుగ్గిరాల ఇంటికి వెళ్లేందుకు కనకం ప్లాన్.. నీరుగార్చిన కృష్ణ మూర్తి:

ఇక ఈ సీన్ కట్ చేస్తే కృష్ణ మూర్తి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కనకం. ఈ లోపు అన్న పూర్ణ వచ్చి ఏంటే ఆ ఇంటికి వెళ్తానని మూర్తికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నావా.. ఆయనకు ఎందుకు చెప్తాను.. మొన్న ఎలా గొడవ చేశారో చూశావ్ కదా అని అంటుంది కనకం.. సరిగ్గా అప్పుడే కృష్ణ మూర్తి వచ్చి అన్నం పెట్టమని అడుగుతాడు. చెప్పడం మర్చి పోయాను మీకో శుభవార్త.. అని కనకం అంటే.. మన ఇంట్లో పప్పు, పెరుగే అనుకున్నా.. శుభవార్తలు కూడా ఉంటాయా అని కృష్ణ మూర్తి అంటాడు. ఎందుకు ఉండవు.. స్వప్న కడుపుతో ఉందంట అండి అని కనకం అంటుంది. ఆ నాటకం మొన్న వారమే అయిపోయింది కదా.. అని కృష్ణ మూర్తి అంటాడు. ఈసారి మాత్రం నిజంగానే కడుపుతో ఉందంట అని కనకం అంటే.. కృష్ణ మూర్తి నమ్మకుండా పైగా కనకాన్ని తిడతాడు. నేను కూడా ముందు నమ్మలేదు. ఆ తర్వాత కావ్య చెప్పింది.. అందుకే నమ్మానని కనకం అంటే.. అవునా పోనీలే అని కృష్ణ మూర్తి అంటాడు. అవును మనం అక్కడికి వెళ్లి ఒకసారి చూసొద్దాం అని కనకం అంటే.. వద్దు అని అంటాడు మూర్తి.

స్వప్నకి మరోసాకి కావ్య క్లాస్:

ఈ సీన్ కట్ చేస్తే.. స్వప్న దగ్గరకు వచ్చి.. నువ్వు చేసిన పని నాకు నచ్చలేదని అంటుంది కావ్య. తప్పు చేయనప్పుడు నువ్వెందుకు డీఎన్ఏ టెస్ట్ కి ఒప్పుకున్నావ్ అని కావ్య అంటే.. ఏం చేయను మరో దారి లేదని స్వప్న అంటుంది. అందేంటి అక్కా.. అనుమానించడమే అవమానం. పైగా నీ క్యారెక్టర్ గురించి టెస్టులు చేయించాలని వాళ్లతో ఎందుకు అన్నావ్.. ఎందుకు ఒప్పుకున్నావ్ అని కావ్య అడిగితే.. తప్పలేదు.. వాళ్లకు కావాల్సింది నిజం. నెత్తి మీద నింద వేసుకెళ్లి.. పుట్టింట్లోకి వెళ్లి ఆ పేదరికంతో నీళ్ల టీ తాగమంటావా.. అని స్వప్న అంటే.. నువ్వు మారవు అక్కా. నువ్వు పుట్టింది.. పెరిగింది.. అక్కడే అని మర్చిపోయావా అని కావ్య అంటుంది. నేను తప్పు చేయలేదని రుజువు చేయసుకోవడానికి ఎంత దూరమైనా.. ఏం చేయడానికైనా సిద్ధం అని స్వప్న అంటుంది. అయినా కావ్య క్లాస్ పీకుతూనే ఉంటుంది. అవును అరుణ్ ని పట్టుకుంటానని వెళ్లావ్? ఏమైంది? అని స్వప్న అడిగితే.. వాడు అక్కడ లేడు.. తప్పించుకు తిరుగుతున్నాడు. ఎలా పట్టుకోవాలో అర్థం కావడం లేదు. వాడి ఇంటి అడ్రెస్ తెలుసా అని కావ్య అడిగితే.. కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాడంట.. వాడి అడ్రెస్ నాకు నిజంగానే తెలీదని స్పప్న అంటుంది. వాడిని ఎలాగైనా పట్టుకుని.. నిజం చెప్పిస్తాను అని కావ్య అంటుంది.

కావ్య, రాజ్ ల పెళ్లి పెటాకులు చేసేందుకు రాహుల్ కుట్ర:

ఇక రాజ్ హాలులో కూర్చుని ఉంటాడు. రాజ్ ని చూసిన రాహుల్.. నీ పెళ్లాన్ని నువ్వు కూడా వదులుకునేలా చేస్తాను. కావ్య.. స్వప్నకి సపోర్ట్ చేస్తే. నువ్వు నాకు సపోర్ట్ చేసేలా చేస్తాను.. దీంతో నీ పెళ్లి కూడా పెటాకులే అని రాహుల్ వీర లెవల్ లో నటించడం మొదలు పెడతాడు. వీళ్లిద్దర్నీ పై నుంచి కావ్య చూస్తుంది. ఏంట్రా అలా ఉన్నావ్ అని రాజ్ అడిగితే.. ఏం చెప్పమంటావ్.. చచ్చి పోవాలని ఉంది. తప్పు చేసిన భార్యతో నెల రోజులు ఎలా కలిసి ఉండాలి? మరోవైపు తాతయ్య ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి గొడవలు జరగకుండా చూస్తున్నా. నువ్వు చెప్పు నీకేం అనిపిస్తుంది అని రాహుల్ అడిగితే.. నాకూ తప్పే అనిపిస్తుంది రా.. అని రాజ్ అంటాడు. నెల రోజులే కద రా ఓపిక పట్టు అని రాజ్ చెప్పి.. పైకి వస్తాడు.

అక్రమ సంబంధాన్ని బయట పెట్టిన కావ్య.. షాక్ లో రాజ్..

ఇదంతా విన్న కావ్య ఆవేశంగా ఉంటుంది. రాజ్ ఎప్పుడు వస్తాడా అని చూస్తుంది. రాజ్ పైకి రాగానే.. నిజం తెలిసి పోయింది అంటుంది కావ్య. ఏ నిజం మీ అక్క గురించా అని రాజ్ అడిగితే కాదు.. మీ గురించే అని అంటుంది కావ్య. నా గురించి నీకేం తెలిసిందని రాజ్ అమాయకంగా అడుగుతాడు. ఇంకా ఎంత కాలం నన్ను మోసం చేస్తారు? ఇంకా ఎంత కాలం ఈ తప్పుడు పని చేస్తూ ఉంటారు? అని రాజ్ ని కావ్య అడుగుతుంది. తప్పుడు పనా.. నేనా నీకేమైనా మెంట్ ఎక్కిందా అని రాజ్ అంటే.. మీ ఆఫీస్ లో పని చేసే శ్రుతికి, మీకు ఏంటి సంబంధం? అని కావ్య అడగ్గా.. తను ఎంప్లాయి.. నేను బాస్ ని అంటాడు రాజ్. అంతేనా అని కావ్య అడుగుతుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో మళ్లీ కలుద్దాం.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!