Gadar 2 OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ‘గదర్‌ 2’ తెలుగు వెర్షన్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఆగస్టు 11న థియేటర్లలో విడుదలైన గదర్‌ 2 సుమారు రూ. 600 కోట్లు రాబట్టినట్లు అంచనా. ఆ తర్వాత ఓటీటీలోనూ ఈ మూవీకి సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఇప్పుడు కేవలం హిందీ వెర్షన్‌ మాత్రమే ఓటీటీలో అందుబాటులో ఉంది. జీ5లో గదర్‌ 2 హిందీ వెర్షన్ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం గదర్‌ 2

Gadar 2 OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి 'గదర్‌ 2' తెలుగు వెర్షన్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
Gadar 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 30, 2023 | 1:00 PM

ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమాల్లో గదర్‌ 2 ఒకటి. సన్నీ డియోల్‌, అమీషా పటేల్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. షారుఖ్ ఖాన్‌ నటించిన పఠాన్, జవాన్‌ సినిమాల తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమా గదర్‌ 2 కావడం విశేషం. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 11న థియేటర్లలో విడుదలైన గదర్‌ 2 సుమారు రూ. 600 కోట్లు రాబట్టినట్లు అంచనా. ఆ తర్వాత ఓటీటీలోనూ ఈ మూవీకి సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఇప్పుడు కేవలం హిందీ వెర్షన్‌ మాత్రమే ఓటీటీలో అందుబాటులో ఉంది. జీ5లో గదర్‌ 2 హిందీ వెర్షన్ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం గదర్‌ 2 తెలుగు వెర్షన్‌ను కూడా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. శుక్రవారం (డిసెంబర్‌ 1) నుంచి ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ ఫామ్ బుక్‌ మై షో స్ట్రీమింగ్‌ యాప్‌లో గదర్‌ 2 తెలుగు వెర్షన్‌ స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతో పాటు తమిళ్‌ లోనూ ఈ బ్లాక్‌ బస్టర్‌ మూవీ అందుబాటులో ఉండనుంది.

2001లో వచ్చిన గదర్ సినిమాకు సీక్వెల్ గా గదర్‌ 2 నిలిచింది. మొదటి పార్ట్‌కు మించి వసూళ్లు అందుకుంది. అన్నిటికీ మించి గత కొన్నేళ్లుగా ప్లాఫ్‌లతో సతమతమవుతోన్న సన్నీడియోల్‌, అమీషా పటేల్‌లకు ఈ మూవీ గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌గా నిలిచింది. గదర్‌ 2 సినిమాకు అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. ఉత్కర్ష్‌ శర్మ, గౌరవ్ చోప్రా, మనీష్‌ వాద్వా, మనోజ్‌ భక్షి, ఆర్యా శర్మ, సిమ్రత్‌ కౌర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మోంటీ శర్మ, మిథున్‌ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో గదర్‌ 2 మూవీని మిస్‌ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఈరోజు అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్..

తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్