Dhootha OTT: ఓటీటీలోకి వచ్చేసిన దూత.. నాగ చైతన్య థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ ఎక్కడ చూడొచ్చంటే?

అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న యువ సామ్రాట్‌ నాగ చైతన్య మొదటి వెబ్‌ సిరీస్‌ ఎట్టకేలకు విడుదలైంది. ఇప్పటికే ఆలస్యమైందనుకున్నారేమో అనుకున్న టైమ్‌ కంటే కాస్త ముందుగానే స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. శుక్రవారం డిసెంబర్‌ 1న దూత స్ట్రీమింగ్‌ కావాల్సి ఉండగా గురువారం (నవంబర్‌ 30) సాయంత్రం 8 గంటల నుంచే

Dhootha OTT: ఓటీటీలోకి వచ్చేసిన దూత.. నాగ చైతన్య థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ ఎక్కడ చూడొచ్చంటే?
Dhootha Web Series
Follow us
Basha Shek

|

Updated on: Dec 01, 2023 | 7:26 AM

అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న యువ సామ్రాట్‌ నాగ చైతన్య మొదటి వెబ్‌ సిరీస్‌ ఎట్టకేలకు విడుదలైంది. ఇప్పటికే ఆలస్యమైందనుకున్నారేమో అనుకున్న టైమ్‌ కంటే కాస్త ముందుగానే స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. శుక్రవారం డిసెంబర్‌ 1న దూత స్ట్రీమింగ్‌ కావాల్సి ఉండగా గురువారం (నవంబర్‌ 30) సాయంత్రం 8 గంటల నుంచే చైతూ వెబ్‌ సిరీస్‌ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. నాగచైతన్యతో మనం, థ్యాంక్యూ లాంటి సినిమాలను తెరకెక్కించిన కె. విక్రమ్‌ కుమార్‌ దూత వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. చైతూతో పాటు ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువొతు, రవీంద్ర విజయ్, జయప్రకాశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో దూత వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సిరీస్‌ అందుబాటులో ఉంది.

సూపర్ నేచురల్ థ్రిల్లింగ్ సిరీస్ గా దూత..

దూత సిరీస్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ సుమారు 40 నిమిషాల నిడివితో ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్‌, టీజర్స్‌, ట్రైలర్స్‌ దూత వెబ్‌ సిరీస్‌పై ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా నాగ చైతన్య ఇంటెన్స్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంది. దీనికి తోడు ప్రస్తుతం ఓటీటీలో హార్రర్‌, థ్రిల్లర్‌ సినిమాలు, సిరీస్‌లకు మంచి ఆదరణ దక్కుతోంది. కాబట్టి ఓటీటీ ప్రియులకు దూత కూడా మంచి ఛాయిస్‌ అని చెప్పుకోవచ్చు. ప్రముఖ నిర్మాత శరద్‌ మరార్‌తో కలిసి అమెజాన్ ప్రైమ్‌ వీడియో ఈ దూత వెబ్‌ సిరీస్‌ను నిర్మించారు. ఇషాన్ చబ్రా సంగీతం అందించారు. కాగా  దూత వెబ్ సిరీస్ కోసం భారీ బడ్జెట్ వెచ్చించినట్లు తెలుస్తోంది. నాగ చైతన్య కెరీర్ లోనే అత్యధికంగా రూ. 45 కోట్లకు పైగానే ఈ సిరీస్ కోసం ఖర్చు చేశారని సమాచారం.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

దూత ట్రైలర్ చూశారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
టీమిండియా జట్టులో కీలక మార్పు.. అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్
టీమిండియా జట్టులో కీలక మార్పు.. అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్
అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా
అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా
కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!
కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం
బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది?
బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది?
ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా
ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా
5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!