Ghost OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఘోస్ట్‌ తెలుగు వెర్షన్‌.. శివన్న యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

దసరా పండగ కానుకగా అక్టోబర్‌ 19న విడుదలైన ఘోస్ట్‌ సినిమా కన్నడ నాట బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. అయితే దసరా ఫెస్టివల్‌కు తెలుగులో తీవ్రమైన పోటీ ఉండడంతో తెలుగు వెర్షన్‌ రెండు వారాలు ఆలస్యంగా రిలీజైంది. నవంబర్‌ 4న విడుదలైన ఈ యాక్షన్‌ థ్రిల్లర్ తెలుగులోనూ ఓ మోస్తరు విజయం సాధించింది

Ghost OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఘోస్ట్‌ తెలుగు వెర్షన్‌.. శివన్న యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
Ghost Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 01, 2023 | 10:14 AM

కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్ హీరోగా నటించిన చిత్రం ఘోస్ట్‌. . ఎంజీ శ్రీనివాస్‌ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీలో జయరాం, అనుపమ్‌ ఖేర్‌, ప్రశాంత్ నారాయణన్‌, అర్చనా జోస్‌, సత్య ప్రకాష్‌, అభిజిత్‌, తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దసరా పండగ కానుకగా అక్టోబర్‌ 19న విడుదలైన ఘోస్ట్‌ సినిమా కన్నడ నాట బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. అయితే దసరా ఫెస్టివల్‌కు తెలుగులో తీవ్రమైన పోటీ ఉండడంతో తెలుగు వెర్షన్‌ రెండు వారాలు ఆలస్యంగా రిలీజైంది. నవంబర్‌ 4న విడుదలైన ఈ యాక్షన్‌ థ్రిల్లర్ తెలుగులోనూ ఓ మోస్తరు విజయం సాధించింది. అయితే పెద్దగా ఇంపాక్ట్‌ చూపించలేకపోయింది. థియేటర్లలో అలరించిన శివన్న ఘోస్ట్‌ మూవీ నవంబర్‌ 17న ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ 5లో అందుబాటులోకి వచ్చింది. అయితే కేవలం కన్నడ వెర్షన్‌ మాత్రమే స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే ఇప్పుడు తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులోకి వచ్చేసింది. శుక్రవారం (డిసెంబర్‌ 1) నుంచి ఘోస్ట్‌ తెలుగు వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది.

సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సందేశ్ నాగరాజ్ ఘోస్ట్‌ సినిమాను నిర్మించారు. అరుణ్ జన్య ఈ సినిమాకు స్వరాలు అందించారు. మహేంద్ర సిమ్హా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించగా.. దీపూ కుమార్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఘోస్ట్‌ సినిమాలో బిగ్‍డాడీ, ముద్దన్న అనే గ్యాంగ్‍స్టర్స్‌ పాత్రలో అదరగొట్టాడు శివన్న. మరి థియేటర్లలో ఘోస్ట్‌ సినిమాను మిస్‌ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

జీ 5 లో స్ట్రీమింగ్..

ఘోస్ట్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే