Dhoomam OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఫహాద్‌ ఫాజిల్‌ ‘ధూమమ్‌’ తెలుగు వెర్షన్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో వెర్స‌టైల్‌ యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఫహాద్ ఫాజిల్‌ నటించిన మరో చిత్రం ధూమమ్‌. యూ టర్న్ ఫేమ్ పవ‌న్ కుమార్ తెరకెక్కించిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీలో అపర్ణా బాల మురళి హీరోయిన్‌గా నటించింది. కేజీఎఫ్‌, కాంతార ల‌తో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అందుకున్న‌ హోంబ‌లే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించడం విశేషం

Dhoomam OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఫహాద్‌ ఫాజిల్‌ 'ధూమమ్‌' తెలుగు వెర్షన్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Dhoomam Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 30, 2023 | 11:08 AM

అల్లు అర్జున్‌ పుష్ప సినిమాలోని భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్‌గా మారిపోయాడు మలయాళ నటుడు ఫ‌హాద్ ఫాజిల్‌. అందుకే ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజవుతున్నాయి. ఆ మధ్యన మామాన్నన్‌ (తెలుగులో నాయకుడు) సినిమాలో ప్రతినాయకుడిగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు. ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో వెర్స‌టైల్‌ యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఫహాద్ ఫాజిల్‌ నటించిన మరో చిత్రం ధూమమ్‌. యూ టర్న్ ఫేమ్ పవ‌న్ కుమార్ తెరకెక్కించిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీలో అపర్ణా బాల మురళి హీరోయిన్‌గా నటించింది. కేజీఎఫ్‌, కాంతార ల‌తో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అందుకున్న‌ హోంబ‌లే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించడం విశేషం.జూన్‌ 23న తమిళంలో విడుదలైన ఈ మూవీ అక్కడి ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. థియేటర్లలో ఓ మోస్తరుగానే ఆడింది. దీంతో తెలుగు, కన్నడ, మలయా, హిందీ భాషల్లోనూ ధూమమ్‌ను రిలీజ్‌ చేస్తారని వార్తలు వచ్చాయి. తెలుగులో ట్రైలర్‌ కూడా రిలీజ్‌ చేశారు. అయితే అదేమీ జరగలేదు. ఇప్పుడీ సినిమా డైరెక్టుగా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ యాపిల్‌ టీవీ ఫ‌హాద్ ఫాజిల్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో గురువారం (నవంబర్‌ 30) అర్ధరాత్రి నుంచే ధూమమ్‌ ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

ధూమమ్‌ సినిమాలో అచ్యుత్‌ కుమార్‌, వినీత్‌, జాయ్‌ మాథ్యూ, దేవ్‌ మోహన్‌, అనూ మోహన్‌, నందు, భానుమతి, అను తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఒక సిగ‌రెట్ కంపెనీలో సేల్స్‌మెన్‌గా ప‌నిచేస్తుంటాడు అవినాశ్‌ (ఫహాద్ ఫాజిల్). అతనికి ఓ రోజు ఓ అప‌రిచిత వ్య‌క్తి నుంచి కాల్‌ వస్తుంది. త‌న మాట విన‌కుంటే అవినాష్ భార్య దియా (అపర్ణ బాలమురళి) బాడీలో ఫిక్స్ చేసిన మైక్రో బాంబ్‌ను పేల్చేస్తాన‌ని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. మరి అవినాష్‌ను బెదిరించిన ఆ అపరిచిత వ్యక్తి ఎవరు? ఆ తర్వాత జరిగిందేంటో తెలుసుకోవాలంటే ధూమమ్‌ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

యాపిల్ టీవీలో స్ట్రీమింగ్..

ధూమమ్ తెలుగు ట్రైలర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే