Bigg Boss 7 Telugu: ఫినాలే అస్త్ర టాస్క్‌లో అమర్ టాప్‌ స్కోర్.. ఓటింగ్‌లో అట్టడుగున ఆ కంటెస్టెంట్స్‌..

ఫినాలే టాస్కుల్లాగే బిగ్‌ బాస్‌ ఓటింగ్‌ కూడా మంచి రసపట్టుగా సాగుతుంది. 13 వారంలో శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్‌ యావర్‌, ప్రియాంక జైన్‌, శోభా శెట్టి, అర్జున్‌ అంబటి, గౌతమ్‌ కృష్ణ నామినేషన్స్‌లో ఉన్నారు. అంటే అమర్ దీప్ చౌదరి మినహా మిగతా వాళ్లంతా నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక గత మూడు రోజుల ఓటింగ్ సరళి చూస్తుంటే

Bigg Boss 7 Telugu: ఫినాలే అస్త్ర టాస్క్‌లో అమర్ టాప్‌ స్కోర్.. ఓటింగ్‌లో అట్టడుగున ఆ కంటెస్టెంట్స్‌..
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Nov 30, 2023 | 6:57 AM

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. దీంతో హౌజ్‌లో టికెట్‌ టు ఫినాలే టాస్కులు కూడా షురూ అయ్యాయి. ‘ఫినాలే అస్త్ర’ రేస్‌లో భాగంగా కంటెస్టెంట్లకు ఆట కావాలా? పాట కావాలా, ఎత్తర జెండా వంటి టాస్క్‌లు ఇచ్చారు. వీటిలో అమర్‌ దీప్‌ టాప్‌ స్కోరు సాధించాడం విశేషం. అలాగే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ కూడా ఫినాలే అస్త్ర టాస్కుల్లో సత్తా చాటాడు. ఇక ఫినాలే టాస్కుల్లాగే బిగ్‌ బాస్‌ ఓటింగ్‌ కూడా మంచి రసపట్టుగా సాగుతుంది. 13 వారంలో శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్‌ యావర్‌, ప్రియాంక జైన్‌, శోభా శెట్టి, అర్జున్‌ అంబటి, గౌతమ్‌ కృష్ణ నామినేషన్స్‌లో ఉన్నారు. అంటే అమర్ దీప్ చౌదరి మినహా మిగతా వాళ్లంతా నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక గత మూడు రోజుల ఓటింగ్ సరళి చూస్తుంటే పల్లవి ప్రశాంత్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి సుమారు 30 శాతానికి పైగా ఓట్లు పడ్డాయి. ఇక రెండో స్థానంలో శివాజీ కొనసాగుతున్నాడు. అతనికి 27 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. ఇక 13.98 శాతం ఓట్లతో ప్రిన్స్‌ యావర్‌ మూడో ప్లేస్‌లో ఉన్నాడు. అంటే మొదటి మూడు స్థానాలు స్పై బ్యాచ్‌ (శివాజీ, ప్రశాంత్‌, యావర్‌) లవే కావడం గమనార్హం.

డేంజర్ జోన్ లో ప్రియాంక, గౌతమ్

అయితే నాలుగో స్థానం నుంచే అసలు కథ మొదలైంది. ఇక్కడ అర్జున్‌ అంబటి నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు. అతనికి 8.22 శాతం ఓట్లు పడ్డాయి. ఇక 6.97 శాతం ఓట్లతో శోభా శెట్టి ఐదో ప్లేస్‌లో ఉంది. ఆమెకు దగ్గరలో ప్రియాంక జైన్‌ ఉంది. ఆమె ఖాతాలో 6.84 శాతం ఓట్లు ఉన్నాయి. ఇక ఆఖరి స్థానంలో గౌతమ్ కృష్ణ ఉన్నాడు. అతనికి కేవలం 5.99 శాతం ఓట్లు పడ్డాయి. అంటే ఇప్పుడు ప్రియాంక, గౌతమ్‌ డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. ఇంకా రెండు రోజులు ఓటింగ్‌ ఉంది కాబట్టి ప్రియాంక, గౌతమ్‌ ప్లేస్‌లలో ఏవైనా మార్పులు రావొచ్చు. ఒకవేళ ఇదే ఓటింగ్‌ ట్రెండ్‌ కొనసాగితే మాత్రం గౌతమ్ పెట్టే సర్దుకోక తప్పదు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్స్..

హౌజ్ లో ప్రియాంక జైన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే