Nayanthara: బర్త్‌ డే స్పెషల్‌.. నయనతారకు ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?

సౌతిండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఇటీవలే తన పుట్టిన రోజు (నవంబర్ 18) గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు నయన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బర్త్‌ డే సందర్భంగా తన భర్త విఘ్నేష్‌ శివన్‌ నుంచి ఒక ప్రత్యేక బహుమతిని అందుకుందీ లేడీ సూపర్‌ స్టార్‌.

Nayanthara: బర్త్‌ డే స్పెషల్‌.. నయనతారకు ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?
Nayanthara Family
Follow us
Basha Shek

|

Updated on: Nov 30, 2023 | 2:16 PM

సౌతిండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఇటీవలే తన పుట్టిన రోజు (నవంబర్ 18) గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు నయన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బర్త్‌ డే సందర్భంగా తన భర్త విఘ్నేష్‌ శివన్‌ నుంచి ఒక ప్రత్యేక బహుమతిని అందుకుందీ లేడీ సూపర్‌ స్టార్‌. ఈ విషయాన్ని రెండు వారాల తర్వాత సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు విఘ్నేష్‌ శివన్‌- నయనతార. ఇంతకు నయన్‌కు అందిన పుట్టిన రోజు బహమతేంటో తెలుసా? రూ. 3 కోట్లు విలువ చేసే జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్. తాజాగా ఈ కారుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన నయన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. ‘వెల్కమ్ హోమ్ యూ బ్యూటీ అంటూ.. మై డియర్ హస్బెండ్, మధురమైన పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు, లవ్ యూ అంటూ’ తన భర్తపై ప్రేమను కురిపించింది నయన్‌. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజన్లు నయన్‌ దంపతులకు కంగ్రాట్స్‌ అంటూ విషెస్‌ చెబుతున్నారు.

కాగా మెర్సిడెస్కారు ప్రారంభ ధర రూ.2.69 కోట్లు కాగా నయన్‌ అందుకున్న కారు సుమారు రూ. 3.40 కోట్ల రూపాయల వరకు ఉంది. ఈ కారులో అనేక విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి. నయనతార, విఘ్నేష్ శివన్ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత 2022 జూన్‌ 22న వివాహం చేసుకున్నారు. ఆపై అక్టోబర్‌లో అద్దె గర్భం ద్వారా కవలలకు జన్మనిచ్చారీ లవ్లీ కపుల్‌. వారికి ఉయిర్, ఉలగమ్ అని నామకరణం చేశారు. కాగా ఈ ఏడాది పుట్టిన రోజు నయనతారకు చాలా ప్రత్యేకం. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన ‘జవాన్’ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దాంతో బాలీవుడ్‌లో ఆమెకు అనేక ఆఫర్లు వస్తున్నాయి. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా ‘కర్ణ’ చిత్రానికి నయనతార ఎంపికయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నయనతార ‘అన్నపూర్ణి’తో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

భర్త, పిల్లలతో నయనతార..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే