- Telugu News Photo Gallery Cinema photos Know what is genre of Nani movie Hi Nanna and will be it a success at boxoffice
Hi Nanna: హాయ్ నాన్న సినిమా జోనర్ ఏంటి ?? నాని ఖాతాలో మరో హిట్ పడేనా ??
హాయ్ నాన్న జోనర్ ఏంటి..? అదేంటి అలా అడుగుతున్నారు..? ట్రైలర్ చూసాక.. మూడు నాలుగు పాటలు కూడా విడుదలయ్యాక కూడా ఈ సినిమా జోనర్ ఏంటో అర్థం కాలేదా అనుకుంటున్నారు కదా..? రిలీజ్‌కి ముందు ఈ డౌట్ వచ్చిందంటే అందులో ఎంతోకొంత మ్యాటర్ ఉన్నట్లే కదా.. మరి ఆ మ్యాటర్ ఏంటో చూద్దాం పదండి. దసరా లాంటి మాస్ సినిమా తర్వాత చాలా తెలివిగా పూర్తి క్లాస్ సినిమాతో వచ్చేస్తున్నారు నాని. దసరాతో శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేసిన నాని.. ఈ సారి శౌర్యును పరిచయం చేస్తున్నారు.
Updated on: Nov 30, 2023 | 2:00 PM

హాయ్ నాన్న జోనర్ ఏంటి..? అదేంటి అలా అడుగుతున్నారు..? ట్రైలర్ చూసాక.. మూడు నాలుగు పాటలు కూడా విడుదలయ్యాక కూడా ఈ సినిమా జోనర్ ఏంటో అర్థం కాలేదా అనుకుంటున్నారు కదా..? రిలీజ్‌కి ముందు ఈ డౌట్ వచ్చిందంటే అందులో ఎంతోకొంత మ్యాటర్ ఉన్నట్లే కదా.. మరి ఆ మ్యాటర్ ఏంటో చూద్దాం పదండి.

దసరా లాంటి మాస్ సినిమా తర్వాత చాలా తెలివిగా పూర్తి క్లాస్ సినిమాతో వచ్చేస్తున్నారు నాని. దసరాతో శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేసిన నాని.. ఈ సారి శౌర్యును పరిచయం చేస్తున్నారు.

హాయ్ నాన్నలో చాలా కోణాలున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అసలు రంగులన్నీ బయటికి వస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో గ్లామర్‌కు లోటు లేదు.

ఇన్నాళ్లూ శృతి హాసన్‌ను దాచేసిన టీం.. విడుదలకు ముందు ఆమెను ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు. హాయ్ నాన్నలో పాప తల్లి శృతి అనే క్లారిటీ ఇచ్చేసారు. తాజాగా విడుదలైన ఓడియమ్మ పాటలో శృతి గ్లామర్ షో హైలైట్‌గా నిలిచింది. అలాగే మృణాళ్ ఠాకూర్ సైతం ఇందులో గ్లామర్ షో బాగానే చేసారని టీజర్, ట్రైలర్‌లోనే అర్థమైపోతుంది.

టీజర్‌లో లిప్ లాక్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఒక్కటి మాత్రం నిజం.. జెర్సీలా ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయితే కాదు.. కచ్చితంగా కాస్త గ్లామర్ డోస్ ఉన్న సినిమానే. అందులోనే కావాల్సినంత ఎమోషన్ మిక్స్ చేసారు దర్శకుడు శౌర్యు. డిసెంబర్ 7న హాయ్ నాన్న విడుదల కానుంది. మరి ఇవన్నీ సినిమాకు ఎంతవరకు హెల్ప్ కానున్నాయో చూడాలి.




