- Telugu News Photo Gallery Cinema photos Prashanth Neel reveals story of Salaar movie starring Prabhas, Shruti Haasan
Prashanth Neel: సలార్ స్టోరీ ఇదేనంటూ రివీల్ చేసిన ప్రశాంత్ నీల్..
సలార్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఆ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ సినిమా కథ ఏమై ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. తాజాగా దీనిపై ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. సలార్ స్టోరీ ఇదేనంటూ హింటిచ్చారు. మరి ఆయనేం చెప్పారు..? సలార్ మెయిన్ థీమ్ ఏంటి..? యాక్షన్ ఉండబోతుందా.. కేజీఎఫ్‌లా ఎమోషనల్ ట్రీట్‌మెంట్ ఇవ్వబోతున్నారా..? సలార్ రిలీజ్‌కు సరిగ్గా లెక్కేస్తే మరో నెల రోజులు కూడా లేదు. మరో 24 రోజుల్లో సినిమా విడుదల కానుంది.
Updated on: Nov 30, 2023 | 1:27 PM

సలార్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఆ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ సినిమా కథ ఏమై ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

తాజాగా దీనిపై ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. సలార్ స్టోరీ ఇదేనంటూ హింటిచ్చారు. మరి ఆయనేం చెప్పారు..? సలార్ మెయిన్ థీమ్ ఏంటి..? యాక్షన్ ఉండబోతుందా.. కేజీఎఫ్‌లా ఎమోషనల్ ట్రీట్‌మెంట్ ఇవ్వబోతున్నారా..?

సలార్ రిలీజ్‌కు సరిగ్గా లెక్కేస్తే మరో నెల రోజులు కూడా లేదు. మరో 24 రోజుల్లో సినిమా విడుదల కానుంది. దాంతో ప్రమోషన్స్ కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా ఎలక్షన్ హడావిడి తగ్గిన తర్వాత.. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి పూర్తిగా 20 రోజులు ప్రమోషన్‌కే ఇచ్చేసారు ప్రభాస్. ఇదిలా ఉంటే తాజాగా సలార్ కథపై ప్రశాంత్ నీల్ హింటిచ్చారు.

ఇప్పటి వరకు సలార్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ బొమ్మని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. కేజిఎఫ్ చూసాక.. ప్రశాంత్ నుంచి అదే ఊహిస్తారెవరైనా..! అయితే కేజియఫ్‌లో ఎంత యాక్షన్ ఉన్నా.. మదర్ సెంటిమెంట్ మరిచిపోకూడదు. దాన్ని హైలైట్ చేసారు ఈ దర్శకుడు. ఇప్పుడు సలార్‌ను ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్.

కథ భారీగా ఉండటంతోనే 2 భాగాలు చేస్తున్నట్లు తెలిపారు ప్రశాంత్. సగం కథ మొదటి భాగంలో చెప్పి.. సెకండ్ పార్ట్‌తో ముగిస్తామంటున్నారీయన. మలయాళం హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. షారుక్ ఖాన్ డంకీ సినిమాతో ఇది పోటీ పడుతుంది. డిసెంబర్ 21న డంకీ రానుంది.




