Jigarthanda Double X OTT: ఇట్స్ అఫీషియల్‌.. ఓటీటీలోకి జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

హీరో రాఘవ లారెన్స్‌, ఎస్‌ జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌. గతంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన జిగర్‌ తాండాకు ఇది సీక్వెల్‌. ఇదే సినిమా వరుణ్‌ తేజ్‌ హీరోగా గద్దల కొండ గణేష్‌గా తెలుగులో రీమేకైంది. దీపావళి కానుకగా నవంబర్‌ 10న థియేటర్లలో విడుదలైన జిగర్తాండ డబుల్‌ ఎక్స్ హిట్‌గా నిలిచింది

Jigarthanda Double X OTT: ఇట్స్ అఫీషియల్‌.. ఓటీటీలోకి జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Jigarthanda Double X Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 01, 2023 | 12:26 PM

హీరో రాఘవ లారెన్స్‌, ఎస్‌ జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌. గతంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన జిగర్‌ తాండాకు ఇది సీక్వెల్‌. ఇదే సినిమా వరుణ్‌ తేజ్‌ హీరోగా గద్దల కొండ గణేష్‌గా తెలుగులో రీమేకైంది. దీపావళి కానుకగా నవంబర్‌ 10న థియేటర్లలో విడుదలైన జిగర్తాండ డబుల్‌ ఎక్స్ హిట్‌గా నిలిచింది. తమిళ్‌తో పాటు తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లే సాధించింది. ముఖ్యంగా రాఘవ లారెన్స్‌, ఎస్‌ జే సూర్యల నటన, యాక్షన్‌ సీక్వెన్స్‌ అదిరిపోయాయని టాక్‌ వినిపించింది. ధనుష్‌ వంటి స్టార్‌ హీరోలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం విశేషం. థియేటర్లలో హిట్‌గా నిలిచిన జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ ఈ యాక్షన్‌ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 8 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది.

మొదటి పార్ట్‌నే తెరకెక్కించిన కార్తీక్‌ సుబ్బరాజే జిగర్తాండ డబుల్ ఎక్స్‌కు దర్శకత్వం వహించారు. నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో, నిమిషా సజయన్‌, సత్యన్‌, అర్వింద్‌ ఆకాష్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్ పై కార్తికేయన్‌ సంతానం, ఎస్‌.కథిరేసన్‌, అలంకార్‌ పాండియన్‌ ఈ సినిమాను నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. మరి థియేటర్లలో ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను మిస్‌ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

డిసెంబర్ 8 నుంచి అందుబాటులోకి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..