Ashish Reddy: దిల్‌ రాజు ఇంట పెళ్లి సందడి.. ఘనంగా ‘రౌడీ బాయ్స్‌’ హీరో నిశ్చితార్థం.. వీడియో చూశారా?

డీ బాయ్స్‌ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్‌ హీరో అద్వైత రెడ్డి అనే అమ్మాయితో కలిసి ఏడడుగులు నడవనున్నాడు. తాజాగా వీరి నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా  ఆశిష్ కి ఉంగరం వేస్తూ 'ఎందుకు నీ చేతులు వణుకుతున్నాయి' అని తమాషాగా అడిగింది అద్వైత

Ashish Reddy: దిల్‌ రాజు ఇంట పెళ్లి సందడి.. ఘనంగా 'రౌడీ బాయ్స్‌' హీరో నిశ్చితార్థం.. వీడియో చూశారా?
Ashish Reddy Engagement
Follow us

|

Updated on: Dec 01, 2023 | 9:45 AM

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన సోదరుడు శిరీష్‌ కుమారుడు హీరో ఆశిష్‌ రెడ్డి త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. రౌడీ బాయ్స్‌ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్‌ హీరో అద్వైత రెడ్డి అనే అమ్మాయితో కలిసి ఏడడుగులు నడవనున్నాడు. తాజాగా వీరి నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా  ఆశిష్ కి ఉంగరం వేస్తూ ‘ఎందుకు నీ చేతులు వణుకుతున్నాయి’ అని తమాషాగా అడిగింది అద్వైత’. ఇలా ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే వధూవరలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకను కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నిర్వహించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆశిష్‌- అద్వైతల పెళ్లి గ్రాండ్‌గా జరగనున్నట్లు సమాచారం. అద్వైత రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని తెలుస్తోంది.

ఆశిష్‌ రెడ్డి విషయానికొస్తే.. రౌడీ బాయ్స్‌ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అనుపమా పరమేశ్వరన్‌ కథానాయికగా నటించిన ఈ సినిమా యూత్‌ను బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీ చాలా గ్యాప్‌ తీసుకున్న ఆశిష్‌ త్వరలోనే సెల్ఫిష్‌ సినిమాతో మరోసారి ఆడియెన్స్‌ను పలకరించనున్నాడు. లవ్‌ టుడే, ఎల్‌ జీ ఎమ్‌ ఫేమ్‌ ఇవానా ఇందులో హీరోయిన్‌గా కనిపించనుంది. కసి విశాల్‌ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆశిష్‌ రెడ్డి పెళ్లికి ముందే ఈ సినిమాను రిలీజ్‌ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్‌.  కాగా  కొన్ని రోజుల క్రితం  దిల్‌ రాజు, శిరీష్‌ల తండ్రి కన్ని మూశారు. విషాదం జరిగిన కుటుంబంలో ఏదైనా శుభ కార్యం జరిగితే మంచిదనే ఆలోచనతో ఆశిష్‌ రెడ్డి పెళ్లి చేయాలని దిల్‌ రాజు కుటుంబ సభ్యులు  భావించారట. అందులో భాగంగానే ఇప్పుడు ఎంగజ్ మెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.  వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఆశిష్‌ పెళ్లి వేడుకకు ప్లాన్‌ చేస్తున్నారట.

ఇవి కూడా చదవండి

ఆశిష్ రెడ్డి నిశ్చితార్థ వేడుక.. వీడియో

‘సెల్ఫిష్’ గా రానున్న ఆశిష్ రెడ్డి..

View this post on Instagram

A post shared by Ashish (@ashish_velamakucha)

దళపతి విజయ్ తో ఆశిష్ రెడ్డి..

View this post on Instagram

A post shared by Ashish (@ashish_velamakucha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..