AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

R Subbalakshmi: సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి ఆర్.సుబ్బలక్ష్మి మృతి..

"నేను తనను కోల్పోయాను. గత 30 సంవత్సరాలుగా తనే నా బలం, ప్రేమ. మా అమ్మమ్మ, నా సుబ్బు, నా బిడ్డ " అంటూ సుబ్బలక్ష్మి ఆసుపత్రిలోని బెడ్ పై ఉన్న ఫోటోను పంచుకున్నారు. సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో అమ్మమ్మ, నానమ్మ పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది . సుబ్బలక్ష్మి మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.

R Subbalakshmi: సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి ఆర్.సుబ్బలక్ష్మి మృతి..
R.subbalakshmi
Rajitha Chanti
|

Updated on: Dec 01, 2023 | 9:57 AM

Share

దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి సుబ్బలక్ష్మి నవంబర్ 30న కొచ్చిలో మరణించారు. 87 ఏళ్ల వయసులో సుబ్బలక్ష్మీ కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు సౌభాగ్య వెంకటేష్ తన ఇన్ స్టా పేజీ ద్వారా తెలిపారు. “నేను తనను కోల్పోయాను. గత 30 సంవత్సరాలుగా తనే నా బలం, ప్రేమ. మా అమ్మమ్మ, నా సుబ్బు, నా బిడ్డ ” అంటూ సుబ్బలక్ష్మి ఆసుపత్రిలోని బెడ్ పై ఉన్న ఫోటోను పంచుకున్నారు. సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో అమ్మమ్మ, నానమ్మ పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది . సుబ్బలక్ష్మి మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.

సుబ్బలక్ష్మి సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు 75 చిత్రాలకు పైగా నటించింది. నందనం, పండిప్పాడ, సిఐడీ మూసా, తిలక్కం చిత్రాల్లో నటించింది. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన బీస్ట్ మూవీతోపాటు.. తమిళంలో అనేక సినిమాల్లో నటించింది. అలాగే తెలుగులో అక్కినేని నాగచైతన్య నటించిన ఏమాయ చేసావే మూవీలోనూ కనిపించింది. తెలుగు, తమిళం, మలయాళంతోపాటు హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. వెండితెరపైనే కాకుండా బుల్లితెర ప్రేక్షకులకు కూడా సుబ్బలక్ష్మి సుపరిచితమే. ఎన్నో సీరియల్స్ సహా.. వాణిజ్య ప్రకటనలలో కనిపించింది.

2002లో విడుదలైన నందనం సినిమాతో 60వ దశకంలో సినీనటిగా అరంగేట్రం చేసింది. నటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టకముందు ఆమె జవహర్ బాలభవన్ లో సంగీత, నాట్య శిక్షకురాలిగా పనిచేశారు. 1951నుంచి ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగినిగా పనిచేశారు. సౌత్ ఇండస్ట్రీ నుంచి ఆల్ ఇండియా రేడియోలో మొదటి లేడీ కంపోజర్ సుబ్బలక్ష్మి. అంతేకాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.