Nithiin: ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ పై హీరో నితిన్ ట్వీట్.. ప్రొడ్యూసర్ రియాక్షన్ ఏంటంటే..

మహేష్ సరికొత్త లుక్‏లో కనిపించనుండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఈ మూవీ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇదివరకే ప్రకటించింది. ఈ క్రమంలోనే గుంటూరు కారం సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ త్వరలోనే రాబోతుందంటూ టాక్ వినిపిస్తుంది. తాజాగా హీరో నితిన్ సైతం గుంటూరు కారం సెకండ్ సింగిల్ పై ఆసక్తికర ట్వీట్ చేశారు.

Nithiin: 'గుంటూరు కారం' సెకండ్ సింగిల్ పై హీరో నితిన్ ట్వీట్.. ప్రొడ్యూసర్ రియాక్షన్ ఏంటంటే..
Mahesh Babu, Nithiin
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 03, 2023 | 5:29 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ సినిమా గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న ఈమూవీ కోసం ఫ్యా్న్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అలాగే ఇందులో మహేష్ సరికొత్త లుక్‏లో కనిపించనుండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఈ మూవీ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇదివరకే ప్రకటించింది. ఈ క్రమంలోనే గుంటూరు కారం సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ త్వరలోనే రాబోతుందంటూ టాక్ వినిపిస్తుంది. తాజాగా హీరో నితిన్ సైతం గుంటూరు కారం సెకండ్ సింగిల్ పై ఆసక్తికర ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఎక్స్‏ట్రా ఆర్టీనరీ మ్యాన్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న నితిన్ ఇప్పుడు గుంటూరు కారం సినిమా పై ట్వీట్ చేశారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా.. ఈ సినిమాలోని ఒలే ఒలే పాపాయి.. పలాసకే వచ్చేయి అనే పాట ప్రోమోను శనివారం విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో నితిన్ మాట్లాడుతూ..ఎక్స్‏ట్రా ఆర్టినరీ మ్యాన్ సినిమా చూస్తున్నప్పుడు మీరంతా కడుపుబ్బా నవ్వకపోతే..మీ డబ్బులు నాగవంశీ వెనక్కు ఇచ్చేస్తారు. మా మధ్య చాలా లావాదేవీలు ఉన్నాయంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

గతంలో మ్యాడ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా నాగవంశీ మాట్లాడుతూ… జాతిరత్నాలు సినిమా కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వితే ప్రేక్షకులు కొన్న టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తా అని ప్రకటించారు. ఇప్పుడు అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నితిన్ ఫన్నీగా మాట్లాడారు. అయితే నితిన్ మాటలకు ప్రొడ్యూసర్ స్పందించారు. ‘ఆరోజు మ్యాడ్ వెబ్ లో అలా అనేశాం. నితిన్. మీరు ఇలా లాక్ చేస్తే ఎలా ?..’ అంటూ హాస్యనటుడు బ్రహ్మానందం ఫోటోను షేర్ చేశారు. అయితే నాగవంశీ పోస్ట్ పై నితిన్న ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.

‘చూసుకోవాలి కదా స్వామి.. ఏదో ఎక్స్ ట్రా ఆర్టినరీ వైబ్ లో నేను అనేసా.. అది ఒకే కానీ.. ఎక్స్ ట్రా ఆర్టినరీ గుంటూరు కారం సెకండ్ సింగిల్ అప్డే్ట్ కోసం వెయిటింగ్ ‘ అంటూ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరి ఫన్నీ చిట్ చాట్ నెట్టింట వైరలవుతుంది. ఇదిలా ఉంటే.. ఎక్స్ ట్రా ఆర్టినరీ సినిమాను నిర్మాత సుధాకర రెడ్డి నిర్మిస్తున్నారు. ఆయన నితిన్ తండ్రి అనే విషయం అందరికీ తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.