Telangana Elections: రేవంత్ అన్నకు కంగ్రాట్స్.. ప్రజాస్వామ్యం బతికే ఉంది.. హీరో నిఖిల్ ఇంకా ఏమన్నారంటే?
ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు కాంగ్రెస్ మరికొద్ది దూరంలో మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి, హస్తం నాయకులు, నేతలకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రముఖ యంగ్ హీరో నిఖిల్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా విషెస్ తెలిపారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని హస్తం పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించనుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు కాంగ్రెస్ మరికొద్ది దూరంలో మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి, హస్తం నాయకులు, నేతలకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రముఖ యంగ్ హీరో నిఖిల్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, ప్రధాని మోడీ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన నిఖిల్ ‘ తెలంగాణలో అఖండ విజయం సాధించిన రేవంత్ అన్నకు కంగ్రాట్స్. అలాగే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు. ప్రజాస్వామ్యం బతికే ఉంది. జైహింద్’ అని ట్వీట్ చేశారు నిఖిల్.
నిఖిల్ కన్నా ముందే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంగ్రెస్ విజయంపై తన దైన శైలిలో స్పందించారు. ‘హాయ్ రాహుల్ జీ, సోనియా జీ.. చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీపై గౌరవం కలిగింది. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు’ అని ట్వీట్ చేశారు ఆర్జీవీ. కాగా ఎన్నికల్లో ఓటమితో గవర్నర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు కేసీఆర్. అయితే డైరెక్టుగా కాకుండా ఓఎస్డీతో తన రాజీనామ లేఖను రాజ్ భవన్ కు పంపించారు.
హీరో నిఖిల్ ట్వీట్..
Congratulations to Revanth Reddy Anna and @INCIndia for the Emphatic Win in Our Telangana state… and also @BJP4India for the Sweeping Victories in Rajasthan , Chhattisgarh & Madhya Pradesh. Democracy is alive and Well .. JAI HIND 🇮🇳🇮🇳🇮🇳 @revanth_anumula @narendramodi pic.twitter.com/PdSO92SwWj
— Nikhil Siddhartha (@actor_Nikhil) December 3, 2023
డైరెక్టర్ ఆర్జీవీ ట్వీట్..
Hi @RahulGandhi ji , and #SoniaGandhi ji , For 1st time in many years I regained a tremendous respect for CONGRESS party 🙏🙏🙏because @revanth_anumula is going to be the Honourable C M of telangana 💐💐💐
— Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :
తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్ :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్ :
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.