Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఇల్లు ఎంత అందంగా ఉందో చూశారా ?.. ఏకంగా రాజభవనమే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది జాన్వీ. సౌత్ ఇండస్ట్రీలో ఆమె నటిస్తోన్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో గ్రామీణ అమ్మాయిగా కనిపించనుంది. అలాగే ఇందులో జాన్వీ పాత్రకు యాక్షన్ సీన్స్ ఉంటాయని టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ మూవీ తర్వాత దక్షిణాది చిత్రపరిశ్రమలో జాన్వీ బిజీ కావడం ఖాయం. ఇదిలా ఉంటే.. ఎప్పుడూ షూటింగ్స్ అంటూ బిజీగా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా ముంబైలోని తన ఇంటిని అభిమానులకు చూపించింది.

Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఇల్లు ఎంత అందంగా ఉందో చూశారా ?.. ఏకంగా రాజభవనమే..
Janhvi Kapoor
Follow us

|

Updated on: Dec 03, 2023 | 4:52 PM

దివంగత హీరోయిన్ శ్రీదేవి నట వారసురాలిగా దఢక్ సినిమాతో తెరంగేట్రం చేసింది హీరోయిన్ జాన్వీ కపూర్. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకుంది. అయితే స్టోరీ ఎంపికలో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ విభిన్న కంటెంట్ చిత్రాలతో అడియన్స్ ముందుకు వచ్చింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో నటిగా నిరూపించుకుంది. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది జాన్వీ. సౌత్ ఇండస్ట్రీలో ఆమె నటిస్తోన్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో గ్రామీణ అమ్మాయిగా కనిపించనుంది. అలాగే ఇందులో జాన్వీ పాత్రకు యాక్షన్ సీన్స్ ఉంటాయని టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ మూవీ తర్వాత దక్షిణాది చిత్రపరిశ్రమలో జాన్వీ బిజీ కావడం ఖాయం. ఇదిలా ఉంటే.. ఎప్పుడూ షూటింగ్స్ అంటూ బిజీగా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా ముంబైలోని తన ఇంటిని అభిమానులకు చూపించింది.

ముంబైలోని తన విలాసవంతమైన ఇంటిని చూపిస్తూ ఓ వీడియో షేర్ చేసింది జాన్వీ. అందులో పార్టీస్ చేసుకోవడానికి ఖాళీ ప్రదేశం ఉంది. తనకు ఇల్లు, ఏఆర్ రెహమాన్ సంగీతం చాలా ఇష్టమని తెలిపిందే. ఆ ఇంట్లో తన తల్లి శ్రీదేవితో గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపింది. అలాగే తన తల్లిదండ్రులు శ్రీదేవి, బోనీ కపూర్ లతో ఎంతో సరదాగా గడిపేవాళ్లమని చెప్పుకొచ్చింది. తన తల్లి మరణించిన తర్వాత తన తండ్రి, చెల్లితో కలిసి ఆ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేకపోయానని.. అందుకు కారణం తన తల్లి జ్ఞాపకాలు నిత్యం గుర్తొస్తాయంటూ ఎమోషనల్ అయ్యింది జాన్వీ. శ్రీదేవి మరణం తర్వాత బోనీ కపూర్ తన కూతుర్లతో కలిసి మరో ఇంటికి వెళ్లిపోయారు.

ఇక జాన్వీ పంచుకున్న వీడియోలో కనిపిస్తున్న ఇల్లు అచ్చం రాజభవనం మాదిరిగానే ఉంది. వైట్, హ్యాష్ కలర్ పెయింటింగ్స్, విలాసవంతంగా.. క్లాసీగా కనిపిస్తుంది. జాన్వీతోపాటు బోనీ కపూర్, ఖుషీ కపూర్ సరదాగా గడిపిన క్షణాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జాన్వీ షేర్ చేసిన హోమ్ టూర్ వీడియో నెట్టింట వైరలవుతుంది. జాన్వీ చివరిసారిగా నితేష్ తివారీ యొక్క బవాల్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె చేతిలో దేవర మాత్రమే కాకుండా మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ దృశ్యాలు చూస్తే.. మంచు కురిసే వేళలో అంటూ.. వీడియో వైరల్.
ఈ దృశ్యాలు చూస్తే.. మంచు కురిసే వేళలో అంటూ.. వీడియో వైరల్.
వాహ్‌! ఐస్ టీ.. మంచును కరిగించి టీ కాచిన పర్యాటకులు.. వీడియో.
వాహ్‌! ఐస్ టీ.. మంచును కరిగించి టీ కాచిన పర్యాటకులు.. వీడియో.
పుష్ప2 ఇక అవనట్టే! | ఒకే వీడియోలో ఇద్దరూ ఏడ్చేసిన సమంత.
పుష్ప2 ఇక అవనట్టే! | ఒకే వీడియోలో ఇద్దరూ ఏడ్చేసిన సమంత.
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి.. శ్రీశైలానికి శివాజీకి ఏంటి సంబంధం?
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి.. శ్రీశైలానికి శివాజీకి ఏంటి సంబంధం?
పొదుపా.. పెట్టుబడా.. రెండింటి మధ్య తేడా ఏమిటి?
పొదుపా.. పెట్టుబడా.. రెండింటి మధ్య తేడా ఏమిటి?
అయ్యో.! 'ఆడపిల్ల' అనుకునే వాళ్లకు.. ఈ తండ్రి కథే ఓ స్ఫూర్తి.!
అయ్యో.! 'ఆడపిల్ల' అనుకునే వాళ్లకు.. ఈ తండ్రి కథే ఓ స్ఫూర్తి.!
బిజినెస్‌ కోసం డబ్బు కావాలా? ఎన్‌పీఎస్‌ విత్‌డ్రాలో రూల్స్ మార్పు
బిజినెస్‌ కోసం డబ్బు కావాలా? ఎన్‌పీఎస్‌ విత్‌డ్రాలో రూల్స్ మార్పు
మరో రెండు వారాల్లో చెల్లెలి పెళ్లి.! ఇంతలోనే ఉహించుకొని షాక్.!
మరో రెండు వారాల్లో చెల్లెలి పెళ్లి.! ఇంతలోనే ఉహించుకొని షాక్.!
బైక్‌పై వెళ్తున్న యువకునికి గుండెపోటు! 26 ఏళ్లకే నూరేళ్లూ నిండాయి
బైక్‌పై వెళ్తున్న యువకునికి గుండెపోటు! 26 ఏళ్లకే నూరేళ్లూ నిండాయి
వన్‌ప్లస్ 12ఆర్ కొన్నవారికి డబ్బులు వెనక్కి.. ఎందుకంటే.?
వన్‌ప్లస్ 12ఆర్ కొన్నవారికి డబ్బులు వెనక్కి.. ఎందుకంటే.?