AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyani Priyadarshan: ‘గాయాలు, కన్నీళ్లు, చిరునవ్వులే నిజమైనవి’.. ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్..

కళ్యాణి.. ప్రస్తుతం మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తుంది. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న కళ్యాణి.. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా కళ్యాణి తన ఇన్ స్టాలో చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఇటీవల ఆమె ఆంటోని సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కాగా.. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తన కాలికి కట్టుతో ఉన్న ఫోటోను షేర్ చేసింది.

Kalyani Priyadarshan: 'గాయాలు, కన్నీళ్లు, చిరునవ్వులే నిజమైనవి'.. ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్..
Kalyani Priyadarshan
Rajitha Chanti
|

Updated on: Dec 03, 2023 | 4:17 PM

Share

కళ్యాణి ప్రియదర్శన్.. తెలుగులో అంతగా క్లిక్ కానీ హీరోయిన్. అక్కినేని అఖిల్ నటించిన హలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించకపోవడంతో ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ బ్యూటీ స్టార్ డమ్ అందుకోలేదు. చాలా రోజులుగా తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న కళ్యాణి.. ప్రస్తుతం మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తుంది. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న కళ్యాణి.. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా కళ్యాణి తన ఇన్ స్టాలో చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఇటీవల ఆమె ఆంటోని సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కాగా.. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తన కాలికి కట్టుతో ఉన్న ఫోటోను షేర్ చేసింది.

ఈ సినిమాలో కళ్యాణి బాక్సింగ్ ప్లేయర్‏గా నటించారు. పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాకా వచ్చిన ఈ మూవీని ఐన్ స్టీన్ మీడియా, నెక్స్ టెల్ స్టూడియోస్, అల్ట్రా మీడియా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించాయి. ఈ చిత్రానికి జోషి దర్శకత్వం వహించగా.. పాన్ ఇండియా లెవల్లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల్లో కళ్యాణి గాయపడినట్లు తెలుస్తోంది. ఆ గాయాల తాలుకూ ఫోటోలను నెట్టింట అభిమానులతో పంచుకున్నారు.

“కంఫర్ట్ జోన్ లో పెరుగుదల లేదు.. గ్రోత్ జోన్ లో సౌకర్య లేదు. ఇది నాకు చాలా ఆలస్యంగా అర్థమయ్యింది. పంచ్ లు నిజమయ్యాయి. కిక్స్ నిజమయ్యాయి. గాయాలు నిజమే.. కన్నీళ్లు నిజమే.. చిరునవ్వులు నిజమైనవి. అయితే రక్తం నిజం కాదు.. క్లాప్స్ కొట్టినందుకు ధన్యవాదాలు అబ్బాయిలు. అరుపులకు ధన్యవాదాలు. అన్నింటికంటే ఆన్ లైన్లో మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు” అంటూ ఆంటోని టైటిల్ ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది కళ్యాణి. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
62 సంవత్సరాల్లో 2500 సినిమాలు చేసిన నటి.. చివరకు..
62 సంవత్సరాల్లో 2500 సినిమాలు చేసిన నటి.. చివరకు..
అంచనాలన్నీ అట్టర్ ప్లాప్.. బుడ్డోడికి ఇక బై బై చెప్పేసినట్లేనా ?
అంచనాలన్నీ అట్టర్ ప్లాప్.. బుడ్డోడికి ఇక బై బై చెప్పేసినట్లేనా ?
నాని సినిమాలో ఛాన్స్ అలా మిస్సయ్యింది.. నాగ దుర్గ..
నాని సినిమాలో ఛాన్స్ అలా మిస్సయ్యింది.. నాగ దుర్గ..
23 ఏళ్ల తర్వాత శ్రీలంకపై టెస్ట్ సిరీస్ కొట్టిన వెస్టిండీస్
23 ఏళ్ల తర్వాత శ్రీలంకపై టెస్ట్ సిరీస్ కొట్టిన వెస్టిండీస్
ఫ్రెంచ్ అధికారి పేరుతో HYDలో పెద్ద ఏరియా! మూసారామ్‌బాగ్ చరిత్ర
ఫ్రెంచ్ అధికారి పేరుతో HYDలో పెద్ద ఏరియా! మూసారామ్‌బాగ్ చరిత్ర
పీఎఫ్ వడ్డీ మీకు వచ్చిందా..? లేదా..? ఇలా చెక్ చేస్కోండి..
పీఎఫ్ వడ్డీ మీకు వచ్చిందా..? లేదా..? ఇలా చెక్ చేస్కోండి..
అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్..
అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్..
ఆ హీరో సినిమాలో ఛాన్స్.. మూడు రోజుల్లో షూటింగ్ అని చెప్పి..
ఆ హీరో సినిమాలో ఛాన్స్.. మూడు రోజుల్లో షూటింగ్ అని చెప్పి..
కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..
కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..
రూ. 6నుండి రూ7లక్షల బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్, సేఫ్టీ ఇచ్చే కార్లు
రూ. 6నుండి రూ7లక్షల బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్, సేఫ్టీ ఇచ్చే కార్లు