Telangana Elections: ఆయనే కాబోయే ముఖ్యమంత్రి.. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై డైరెక్టర్ ఆర్జీవీ సంచలన ట్వీట్
ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో 'హస్త' గతం చేసుకున్న కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దిశగా వేగంగా వెళ్తోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మరోవైపు పలువురు ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాపై తనదైన శైలిలో స్పందించారు

ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో ‘హస్త’ గతం చేసుకున్న కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దిశగా వేగంగా వెళ్తోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మరోవైపు పలువురు ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాపై తనదైన శైలిలో స్పందించారు. హాయ్ రాహుల్ గాంధీజీ, సోనియా గాంధీజీ, చాలా సంవత్సరాల తర్వాత మొదటి సారి కాంగ్రెస్ పార్టీ పట్ల నాకు విపరీతమైన గౌరవం వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి.. తెలంగాణ సీఎం కాబోతున్నారంటూ ట్వీట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘హాయ్ రాహుల్ గాంధీజీ, సోనియా గాంధీజీ, చాలా సంవత్సరాల తర్వాత మొదటి సారి కాంగ్రెస్ పార్టీ పట్ల నాకు విపరీతమైన గౌరవం వచ్చింది. ఎందుకో తెలుసా? రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎం కాబోతున్నారు’ అని ట్వీట్ చేశాడు ఆర్జీవీ. ప్ర స్తుతం ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా మొత్తం 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 41 స్థానాల్లో విజయం సాధించింది. మరో 26 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు బీఆర్‌ఎస్ అభ్యర్థులు 17 స్థానాల్లో గెలుపొందగా, మరో 19 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ముందు వరుసలో ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్‌లో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక కామారెడ్డిలో మాత్రం ఉత్కంఠ పోరు సాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుండగా, సీఎం కేసీఆర్ మూడో స్థానంలో ఉన్నారు.
డైరెక్టర్ ఆర్జీవీ ట్వీట్..
Hi @RahulGandhi ji , and #SoniaGandhi ji , For 1st time in many years I regained a tremendous respect for CONGRESS party 🙏🙏🙏because @revanth_anumula is going to be the Honourable C M of telangana 💐💐💐
— Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023
SUPER DUPER proud to know the present HONOURABLE CHIEF MINISTER of TELANGANA the WARRIOR KING REVANTH REDDY ..Hey @revanth_anumula Take 10000000000000000000000 BOWS🙏 pic.twitter.com/bQDVFdUjSP
— Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :
తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్ :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్ :
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.