Shah Rukh Khan: అది బాద్ షా రేంజ్.. సింపుల్ హుడీలో స్టైలీష్గా షారుఖ్.. ధర ఎంతంటే..
ఇప్పుడు తన తదుపరి సినిమా డుంకీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. డుంకీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తలపడబోతున్నాడు షారుఖ్. అటు డుంకీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న షారుఖ్.. మారుతున్న ఫ్యాషన్ ప్రపంచంలో బాద్ షా ఎప్పుడూ తన స్టైల్ తో అట్రాక్షన్ గా నిలుస్తుంటారు. ఇక ఇప్పుడు మరోసారి బ్లాక్ కలర్ జాకెట్ లో స్టైలీష్ గా కనిపించారు.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నారు. ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసిన షారుఖ్.. బీటౌన్ హిస్టరీ రిపీట్ చేశాడు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త ఆశలు చిగురించాయి. ఇక ఇప్పుడు తన తదుపరి సినిమా డుంకీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. డుంకీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తలపడబోతున్నాడు షారుఖ్. అటు డుంకీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న షారుఖ్.. మారుతున్న ఫ్యాషన్ ప్రపంచంలో బాద్ షా ఎప్పుడూ తన స్టైల్ తో అట్రాక్షన్ గా నిలుస్తుంటారు. ఇక ఇప్పుడు మరోసారి బ్లాక్ కలర్ జాకెట్ లో స్టైలీష్ గా కనిపించారు.
ఇటీవల ముంబై విమానాశ్రయంలో పూర్తిగా బ్లాక్ డ్రెస్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు షారుఖ్. బ్లాక్ జీన్స్, బ్లాక్ టీషర్ట్, చిక్ అర్మానీ జాకెట్‌లో సింపుల్ గా కనిపించాడు షారుఖ్. అయితే ఇప్పుడు అతను ధరించిన బ్లాక్ జాకెట్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. సెలబ్రేటీ అవుట్ ఫిట్ డికోడ్ ఇన్ స్టా పేజీ ప్రకారం షారుఖ్ బ్లాక్ జాకెట్ ధర రూ.61,892. అయితే షారుఖ్ రేంజ్ కు ఈ జాకెట్ ధర సాధారణమని కామెంట్స్ వస్తున్నాయి.
View this post on Instagram
ఇటీవలే జవాన్ సినిమాతో దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు షారుఖ్. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇందులో నయనతార, దీపికా పదుకొణె నటించగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఈ మూవీ తర్వాత షారుఖ్ డుంకీ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.