Guess The Actress: బొద్దుగా మారిపోయిన ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఈ బ్యూటీ తల్లి, అక్క కూడా హీరోయిన్లే..

పై ఫొటోలో ఉన్న ఉన్నదెవరో గుర్తుపట్టారా? ఈమె ప్రముఖ కోలీవుడ్‌ హీరోయిన్‌. తమిళంలో సినిమాలు చేసినా తెలుగు ఆడియెన్స్‌కు కూడా సుపరిచితమే. చేసింది రెండు సినిమాలైనా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అన్నట్లు.. ఈ అందాల తార తల్లి, అక్క కూడా హీరోయిన్లే. ముఖ్యంగా తల్లి 90వ దశకంలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది.  ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవికి పోటీగా డ్యాన్స్‌ చేసి అభిమానుల మన్ననలు

Guess The Actress: బొద్దుగా మారిపోయిన ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఈ బ్యూటీ తల్లి, అక్క కూడా హీరోయిన్లే..
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Dec 03, 2023 | 3:30 PM

పై ఫొటోలో ఉన్న ఉన్నదెవరో గుర్తుపట్టారా? ఈమె ప్రముఖ కోలీవుడ్‌ హీరోయిన్‌. తమిళంలో సినిమాలు చేసినా తెలుగు ఆడియెన్స్‌కు కూడా సుపరిచితమే. చేసింది రెండు సినిమాలైనా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అన్నట్లు.. ఈ అందాల తార తల్లి, అక్క కూడా హీరోయిన్లే. ముఖ్యంగా తల్లి 90వ దశకంలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది.  ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవికి పోటీగా డ్యాన్స్‌ చేసి అభిమానుల మన్ననలు అందుకుంది. ఇక సోదరి విషయానికొస్తే.. పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించింది. ఇదే బ్యాగ్రౌండ్‌తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందీ అందాల తార. రెండంటే రెండు సినిమాల్లో నటించింది. అయితే హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. మరి ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? కష్టంగా ఉందా.. అయితే మీకో క్లూ. ఈ బ్యూటీ అక్క ఇటీవలే పెళ్లిపీటలెక్కింది. మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయినా కనిపెట్టలేకపోయారా? అయితే సమాధానం మేమే చెబుదాం లెండి. ఈ బొద్దుగుమ్మ మరెవరో కాదు అలనాటి అందాల తార రాధ రెండో కూతురు తులసి నాయర్‌. అదే నండి ఇటీవలే పెళ్లిపీటలెక్కిన కార్తీక సోదరి.

మణిరత్నం ‘కాదల్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది తులసి. దీనినే తెలుగులో కడలిగా విడుదల చేశారు. గౌతమ్ కార్తీక్‌ హీరోగా నటించాడు. ఇందులో తన క్యూట్‌ నటనతో కట్టిపడేసిందీ అందాల తార. ఆ తర్వాత 2014లో యాన్‌ అనే మరో తమిళ సినిమాలో కథానాయికగా మెరిసింది. దీనినే రంగం 2 పేరుతో తెలుగులో విడుదల చేశారు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది తులసి. సోషల్‌ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ కనిపిస్తుంటుంది. తాజాగా అక్క కార్తీక పెళ్లిలో మరోసారి కనిపించింది. అయితే అప్పటికీ, ఇప్పటికీ చాలా మారిపోయిందీ అందాల తార. బొద్దుగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. చాలామంది ఆమెను గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత రాధ రెండో కూతురని తెలిసి ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి

అక్క కార్తీకతో నటి తులసి నాయర్..

View this post on Instagram

A post shared by Thulasi Nair (@thulasin)

నటి కార్తీ క పెళ్లి వీడియో

కార్తీక పెళ్లిలో తులసి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.