Bigg Boss 7 Telugu: ప్రశాంత్ పై అర్జున్, ప్రియాంక సీరియస్.. తోసేసి మరీ రెచ్చిపోయిన అర్జున్..

నిన్నటి నుంచి కంటెస్టెంట్లకు ఫన్నీ గేమ్స్ ఇస్తున్నాడు బిగ్‏బాస్. కానీ వాటిని సైతం సీరియస్ గా తీసుకుంటూ నువ్వా నేనా అన్న రేంజ్ లో పోటీ పడుతున్నారు హౌస్మేట్స్. సీజన్ 7 గ్రాండ్ ఫినాలేకు ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉండగా.. ఇప్పటికీ ఒకరిపై మరొకరు అరుస్తూ నానా హంగామా చేస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో రైతుబిడ్డపై రెచ్చిపోయారు అర్జున్, ప్రియాంక. ఇన్నాళ్లు శాంతంగా కనిపించిన అర్జున్ ఈసారి మాత్రం ప్రశాంత్ పై గట్టిగానే సీరియస్ అయ్యాడు.

Bigg Boss 7 Telugu: ప్రశాంత్ పై అర్జున్, ప్రియాంక సీరియస్.. తోసేసి మరీ రెచ్చిపోయిన అర్జున్..
Bigg Boss 7 Telugu Promo
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 06, 2023 | 5:03 PM

బిగ్‏బాస్ సీజన్ 7 ముగింపుకు ఇంకా కొద్ది రోజులే టైముంది. మరో రెండు వారాల్లో విన్నర్ ఎవరనేది తెలియనుంది. దీంతో ఇప్పుడు కంటెస్టెంట్స్ తమ గేమ్ ప్లాన్ మార్చేశారు. మొన్నటివరకు కలిసున్న SPA బ్యాచ్ ఇప్పుడు కొత్తగా గొడవ పడుతున్నారు. చిన్న చిన్న విషయాలకు అరుస్తూ.. ఏడుస్తూ గోల గోల చేస్తున్నారు. ఇక నిన్నటి నుంచి కంటెస్టెంట్లకు ఫన్నీ గేమ్స్ ఇస్తున్నాడు బిగ్‏బాస్. కానీ వాటిని సైతం సీరియస్ గా తీసుకుంటూ నువ్వా నేనా అన్న రేంజ్ లో పోటీ పడుతున్నారు హౌస్మేట్స్. సీజన్ 7 గ్రాండ్ ఫినాలేకు ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉండగా.. ఇప్పటికీ ఒకరిపై మరొకరు అరుస్తూ నానా హంగామా చేస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో రైతుబిడ్డపై రెచ్చిపోయారు అర్జున్, ప్రియాంక. ఇన్నాళ్లు శాంతంగా కనిపించిన అర్జున్ ఈసారి మాత్రం ప్రశాంత్ పై గట్టిగానే సీరియస్ అయ్యాడు. ఇక అనవసరంగా వారి మధ్యలోకి వెళ్లిమరీ ప్రశాంత్ ను తిట్టేస్తోంది ప్రియాంక.

తాజాగా విడుదలైన ప్రోమోలో ముందుగా ఇసుకతో తయారు చేసిన కేకులపై చెర్రీలు పెట్టాడు బిగ్‏బాస్. ఒక పేక ముక్కలాంటి కార్డుతో చెర్రీ పడిపోకుండా కేకును కట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎవరి చెర్రీ పడిపోతే వాళ్లు ఓడిపోయినట్లే. ఇందులో ముందుకు అర్జున్, యావర్, శివాజీ, ప్రియాంక ఓడిపోయినట్లు చూపించారు. ఇక మిగిలిన ప్రశాంత్, అమర్, శోభాలలో విన్నర్ అయినట్లు తెలుస్తోంది. ఇక రెండో టాస్కులో గార్డెన్ ఏరియాలో ఓ గంట పెట్టి.. బజర్ మోగినప్పుడు ఎవరైతే ముందుగా వచ్చి గంట కొడతారో వాళ్లే రెండో కంటెండర్ అవుతారని చెప్పాడు.

అయితే బజర్ మెగిన వెంటనే అందరు పరిగెత్తగా.. అర్జున్.. పక్కనే ఉన్న ప్రశాంత్, యావర్ ఇద్దరిని చేతులతో పక్కకు తోసేశాడు. ఆ క్రమంలోనే అర్జున్ చేయి ప్రశాంత్ దవడకు తాగింది. దీంతో ముగ్గురు గంట దగ్గర పడిపోయారు. ఆ వెంటనే అర్జున్ లేచి గంట కొట్టాడు. అయితే సంచాలక్ అమర్ కు ప్రశాంత్ అర్జున్ గురించి కంప్లైంట్ చేశాడు. దీంతో అర్జున్ సీరియస్ అయ్యాడు. వెదవ రీజన్స్ చెప్పకు ప్రశాంత్, నిన్న నన్ను కూడా ఇలానే ఆపావ్.. నువ్వు మరి అప్పుడు నేను అన్నానా అంటూ కళ్లు పెద్దవి చేసి సీరియస్ అయ్యాడు. ఇక వీరిద్దరు గొడవ పడుతుంటే మధ్యలోకి దూరిపోయింది ప్రియాంక. మీ దారిలో మీరు పరిగెత్తొచ్చు కదా.. అంటూ ప్రశాంత్ ను తిట్టింది. అయితే ప్రియాంక మాటలు వింటున్న శివాజీ సైలెంట్ గా ఉన్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!