AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ఓటింగ్‌లో సీరియల్‌ బ్యాచ్‌కు దిమ్మతిరిగే షాక్‌.. ఈ వారం ఆమె బ్యాగ్‌ సర్దుకోవాల్సిందే

ఇక ఈ వారం బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి ఎవరు ఎలిమినేట్‌ అవుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది? అసలు ఎలిమినేషన్‌ ప్రక్రియ ఉంటుందా? లేదా? అన్నది మరో ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే గతంలో టాప్‌-7 కంటెస్టెంట్స్‌తోనే గ్రాండ్‌ ఫినాలే నిర్వహించవచ్చని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. మరోవైపు గతంలో లాగే టాప్‌-5 ఇంటి సభ్యులతోనే గ్రాండ్‌ ఫినాలే కండక్ట్‌ చేయాలంటే ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ జరగాలి

Bigg Boss 7 Telugu: ఓటింగ్‌లో సీరియల్‌ బ్యాచ్‌కు దిమ్మతిరిగే షాక్‌.. ఈ వారం ఆమె బ్యాగ్‌ సర్దుకోవాల్సిందే
Bigg Boss 7 Telugu
Basha Shek
|

Updated on: Dec 07, 2023 | 10:11 PM

Share

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ సెలబ్రిటీ గేమ్‌ షోకు శుభం కార్డు పడనుంది. ఇక హౌజ్‌లోనూ ఫినాలే టాస్కులు హోరా హోరీగా సాగుతున్నాయి. డిసెంబర్‌ 17న బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే జరగవచ్చునని తెలుస్తోంది. హౌజ్‌లో అందరి కంటే ముందు అంబటి అర్జున్‌ ఫినాలేకు చేరుకున్నాడు. ఇక ఈ వారం బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి ఎవరు ఎలిమినేట్‌ అవుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది? అసలు ఎలిమినేషన్‌ ప్రక్రియ ఉంటుందా? లేదా? అన్నది మరో ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే గతంలో టాప్‌-7 కంటెస్టెంట్స్‌తోనే గ్రాండ్‌ ఫినాలే నిర్వహించవచ్చని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. మరోవైపు గతంలో లాగే టాప్‌-5 ఇంటి సభ్యులతోనే గ్రాండ్‌ ఫినాలే కండక్ట్‌ చేయాలంటే ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ జరగాలి. 14వ వారంలో అర్జున్‌ అంబటి తప్ప మొత్తం ఆరుగురు నామినేషన్స్‌లో నిలిచారు. శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్ చౌదరి, ప్రియాంక జైన్, శోభా శెట్టి ఉన్నారు. అంబటి అర్జున్‌ ఎలాగో ఇప్పటికే ఫినాలేలోకి వెళ్లిపోయాడు కాబట్టి ఎలిమినేషన్‌ ఉండదు. కాబట్టి ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో వారు ఈ వారం నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది.

ఇక ఓటింగ్‌ ట్రెండ్‌ను పరిశీలిస్తే. ప్రస్తుతానికి SPY బ్యాచ్‌ దే ఆధిపత్యం. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ అగ్ర స్థానంలో ఉన్నాడు. అతనికి వస్తోన్న ఓటింగ్‌ను చూస్తుంటే ఈ సీజన్‌కు రైతు బిడ్డనే టైటిల్‌ విన్నర్‌గా నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక రెండు, మూడు స్థానాల్లో శివాజీ, ప్రిన్స్‌ యావర్‌ కొనసాగుతున్నారు. ఇక సీరియల్‌ బ్యాచ్‌కు ఓటర్లు దిమ్మతిరిగే షాక్‌ ఇస్తున్నారు. ముఖ్యంగా టైటిల్‌ రేసులో ఉన్నాడనుకుంటోన్న అమర్‌ దీప్‌ చౌదరికి తక్కువ ఓట్లు పడుతున్నాయి. అలాగే ప్రియాంక జైన్‌, శోభా శెట్టి ప్రస్తుతం చివరి 2 స్థానాల్లో ఉన్నారు. అంటే వీరిద్దరే డేంజర్‌ జోన్‌లో ఉన్నారన్న మాట. అంటే శోభ, ప్రియాంకలో ఎవరో ఒకరిని ఎలిమినేట్‌ చేసే అవకాశముంది. మరి శోభా శెట్టి పెట్టే సర్దుకోవాల్సిందేనా? లేదా?అన్నది మరో రెండు రోజుల్లో తేలనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..