Tiger 3 OTT: ఓటీటీలోకి సల్మాన్ ఖాన్‌ లేటెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌.. టైగర్‌ 3 స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

దీపావళి కానుకగా నవంబర్‌ 12న థియేటర్లలోకి అడుగుపెట్టాడు టైగర్‌ 3. మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.450 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అన్నిటికీ మించి గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతోన్న సల్మాన్‌కు మంచి సాలిడ్‌ హిట్‌ ఇచ్చింది.

Tiger 3 OTT: ఓటీటీలోకి సల్మాన్ ఖాన్‌ లేటెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌.. టైగర్‌ 3 స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Tiger 3 Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 05, 2023 | 4:29 PM

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నటించిన లేటెస్ట్‌ సినిమా టైగర్‌ 3. ఏక్‌ థా టైగర్‌, టైగర్‌ జిందాహై తర్వాత టైగర్‌ ఫ్రాంచైజీ సిరీస్‌లో వచ్చిన మూడో సినిమా ఇది. మనీష్‌ శర్మ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్‌ యాక్షన్‌ మూవీలో కత్రినా కైఫ్‌ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్‌ సీరియల్‌ కిస్సర్‌ ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా మెప్పించాడు. దీపావళి కానుకగా నవంబర్‌ 12న థియేటర్లలోకి అడుగుపెట్టాడు టైగర్‌ 3. మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.450 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అన్నిటికీ మించి గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతోన్న సల్మాన్‌కు మంచి సాలిడ్‌ హిట్‌ ఇచ్చింది. థియేటర్లలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన టైగర్‌ 3 ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌ సినిమా స్ట్రీమింగ్‌ డేట్ ఖరారైందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో టైగర్‌ 3 మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. సల్మాన్‌, కత్రినాలకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అమెజాన్‌ ప్రైమ్‌ భారీ మొత్తంలో డీల్‌ కుదుర్చుకుంది.ఈ క్రమంలో డిసెంబర్‌ 12న టైగర్‌ 3ని ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు అమెజాన్‌ సన్నాహాలు చేస్తుందని టాక్‌ వినిపిస్తోంది. ఒకవేళ ఈ తేదీ కుదరకపోతే క్రిస్మస్‌ పండగ కానుకగా డిసెంబర్‌ 25న సల్మాన్‌ ఖాన్‌ మూవీని స్ట్రీమింగ్‌కు అందుబాటులో తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా టైగర్‌ 3 సినిమాను నిర్మించారు. ఎప్పటిలాగే సల్మాన్ యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. అభిమానులను అలరించాడు. అతనికి తోడు బాలీవుడ్ సూపర్‌ స్టార్స్‌ షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ అతిథి పాత్రల్లో మెరిసి ఫ్యాన్స్‌ను మెప్పించారు. ఇక కత్రినా టవల్‌ ఫైట్‌ ముందు నుంచి సినిమాపై ఆసక్తి పెంచింది. సీనియర్‌ హీరోయిన్లు రేవతి, సిమ్రాన్‌ కీలక పాత్రల్లో మెరిశారు. రిద్ధి డోగ్రా, రణ్‌వీర్‌ షోరే తదితరులు సపోర్టింగ్‌ రోల్స్‌ చేశారు. ప్రీతమ్‌ పాటలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..