Japan Movie: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కార్తీ ‘జపాన్’ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే..
ఈ చిత్రానికి జోకర్ మూవీ ఫేమ్ డైరెక్టర్ రాజు మురుగన్ దర్శకత్వం వహించారు. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించగా.. ఇందులో కార్తీ సరికొత్త పాత్రలో కనిపించారు. ట్రైలర్ విడుదలతోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు కార్తి. డిఫరెంట్ గెటప్, స్లాంగ్, బాడీ లాంగ్వేజ్‌తో కడపుబ్బా నవ్వించాడు. దీపావళి కానుకగా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
కోలీవుడ్ హీరో కార్తీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు అతడు నటించిన సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవలే జపాన్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. కార్తీ కెరీర్లో 25వ సినిమాగా వచ్చిన జపాన్ చిత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రానికి జోకర్ మూవీ ఫేమ్ డైరెక్టర్ రాజు మురుగన్ దర్శకత్వం వహించారు. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించగా.. ఇందులో కార్తీ సరికొత్త పాత్రలో కనిపించారు. ట్రైలర్ విడుదలతోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు కార్తి. డిఫరెంట్ గెటప్, స్లాంగ్, బాడీ లాంగ్వేజ్‌తో కడపుబ్బా నవ్వించాడు. దీపావళి కానుకగా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.
కొన్నిరోజులుగా జపాన్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ 11 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అందుబాటులోకి రానుందని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. ‘వాంటెడ్.. కార్తీ మన మనసులు దొచుకున్నాడు.. అలాగే దారిలోని కొన్ని నగలను ఎత్తుకెళ్లాడు’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో కార్తీ దొంగ పాత్రలో కనిపించాడు.
Intha kadhai-la thimingalam sikkuma sikkadha nu paaka neenga ready ah? #Japan, coming to Netflix in Tamil, Telugu, Malayalam and Kannada on 11 Dec! pic.twitter.com/rLWRBVyL6N
— Netflix India South (@Netflix_INSouth) December 4, 2023
ఊపిరి సినిమాతో తెలుగు వారికి దగ్గరయ్యాడు కార్తీ . ఇందులో నాగార్జునతోపాటు.. కార్తీ ప్రధాన పాత్రలో నటించి మెప్పించాడు. ఆ తర్వాత తమిళంలో కార్తీ నటించిన సినిమాలు తెలుగులోనూ హిట్ అయ్యాయి. ప్రస్తుతం నలన్ కుమారసామీ దర్శకత్వంలో వా వాతియారే అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కృతిశెట్టి కథానాయికగా నటిస్తుంది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆ తర్వాత త్వరలోనే ఖైదీ 2 సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.
Here is the #Japan Juke Box 🎼. Press play and let the magic unfold 🎶
Tamil – https://t.co/tP3tmeTKVG Telugu – https://t.co/FNc2qkik9t
A @gvprakash musical 🎵 @Karthi_Offl @ItsAnuEmmanuel @pradeep_1123 @Dir_Rajumurugan @RSeanRoldan @HaricharanMusic @YugabhaarathiYB… pic.twitter.com/VBeWt4honK
— DreamWarriorPictures (@DreamWarriorpic) November 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.